ఆ ఒక్కటే ఆలోచిస్తున్నా.. బీజేపీలో చేరికపై జేసీ దివాకర్ రెడ్డి స్పందన...

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నుంచి సామాన్య కార్యకర్త వరకు అందరూ తనను బీజేపీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారని చెప్పారు.

news18-telugu
Updated: April 12, 2020, 4:57 PM IST
ఆ ఒక్కటే ఆలోచిస్తున్నా.. బీజేపీలో చేరికపై జేసీ దివాకర్ రెడ్డి స్పందన...
జేసీ దివాకర్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
భారతీయ జనతా పార్టీలో చేరే అంశంపై స్పందించారు టీడీపీ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నుంచి సామాన్య కార్యకర్త వరకు అందరూ తనను బీజేపీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారని చెప్పారు. అయితే, పార్టీ మారే అంశంపై తన కుటుంబ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటానన్నారు. ‘జేపీ నడ్డా నన్ను బీజేపీలోకి రావాలని కోరిన మాట వాస్తవం. నా కుటుంబ గౌరవం గురించి ఆలోచిస్తున్నా. రాష్ట్రంలో నాకుంటూ ఒక చరిత్ర ఉంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. నా కుటుంబ చరిత్రను కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటా.’ అని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఇటీవల బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అనంతపురం జిల్లాలోని జేసీ దివాకర్ రెడ్డి ఫామ్ హౌస్‌లో ఆయన్ను కలవడంతో జేసీ పార్టీ మారుతున్నారంటూ మరోసారి ప్రచారం మొదలైంది.

చంద్రబాబుకు షాక్... మాజీ సన్నిహితుడే సూత్రధారి | cm Ramesh planning to give big shock to chandrababu naidu tdp mlc btech ravi may join bjp ak
జేసీ దివాకర్ రెడ్డిని కలిసిన సీఎం రమేష్, బీటెక్ రవి(ఫైల్ ఫోటో)


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసుల మీద కూడా జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. కరోనా అనేది రాష్ట్రానికే పరిమితం కాలేదని ప్రపంచం మొత్తం వ్యాపించిందని అన్నారు. ఏపీలో కరనా మరణాలు తక్కువగా ఉన్నాయన్నారు. ‘ఏపీలో పెద్దగా కరోనా మరణాలు లేవని సంకలు గుద్దుకోవద్దు. పూర్తిగా లేకపోయినా కూడా తేలికగా తీసుకోవద్దు. అప్రమత్తంగా ఉండాలి.’ అని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: April 12, 2020, 4:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading