మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మరో బిగ్ షాక్

జేసీ బ్రదర్స్‌కు రాజకీయంగానూ ఊహించని ఎదురుదెబ్బ తగలింది.

news18-telugu
Updated: November 20, 2019, 1:31 PM IST
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మరో బిగ్ షాక్
జేసీ దివాకర్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
టీడీపీ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి వరుస షాక్‌లు తగులుతున్నాయి. కొంతకాలంగా నిబంధనలు పాటించడం లేదంటూ జేసీ బ్రదర్స్‌కు చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జేసీ బ్రదర్స్‌కు రాజకీయంగానూ ఊహించని ఎదురుదెబ్బ తగలింది. జేసీ బ్రదర్స్‌కు ముఖ్య అనుచరుడిగా ఉన్న షబ్బీర్ అలీ అలియాస్ గోరా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.బుధవారం నాడు గోరాతో పాటు పలువురు అనుచరులు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. జేసీ అనుచరులతో పాటు పలువురు లారీ యజమానులు కూడా వైసీపీలో చేరారు.పార్టీలోకి వచ్చిన వారికి వైసీపీ కండువా కప్పిన ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు. కాగా మొత్తం 500 మంది పెద్దారెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారని తెలుస్తోంది.

వైసీపీలో చేరిన జేసీ బ్రదర్స్ అనుచరులు


తాడిపత్రి నుంచి వరుసగా ఆరుసార్లు శాసనసభకు ఎన్నికైన జేసీ దివాకర్ రెడ్డి... 2014లో అనంతపురం ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో తాడిపత్రి నుంచి ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో జేసీ బ్రదర్స్‌కు కంచుకోట లాంటి తాడిపత్రిలో వైసీపీ విజయం సాధించారు. వైసీపీ తరపున పోటీ చేేసిన పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.First published: November 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>