ఆయన వల్లే జగన్‌ గెలుపు... మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

సీఎం జగన్‌కు పరిపాలన అనుభవం లేదని... మంచి, చెడు చెప్పేవారు లేరని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

news18-telugu
Updated: October 15, 2019, 5:33 PM IST
ఆయన వల్లే జగన్‌ గెలుపు... మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
సీఎం జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
ఎప్పటికప్పుడు తనదైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే సీనియర్ రాజకీయ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి... మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పరిపాలన గురించి చెప్పాలంటే మరో ఆరు నెలల గడువు కావాలని ఆయన తెలిపారు. ప్రధాని మోదీ మంత్రదండం కారణంగానే సీఎం జగన్ అధికారంలోకి వచ్చారని జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌కు పరిపాలన అనుభవం లేదని... మంచి, చెడు చెప్పేవారు లేరని జేసీ అభిప్రాయపడ్డారు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టుగా సీఎం జగన్ వ్యవహారం ఉందని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కారణంగా ఆయనకు మంచి, చెడు రెండూ జరుగుతున్నాయని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్‌ను విమర్శించే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న జేసీ దివాకర్ రెడ్డి... తాజాగా మోదీ కారణంగానే జగన్ అధికారంలోకి వచ్చాడని వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. మరి... జేసీ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.




First published: October 15, 2019, 5:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading