తెలంగాణ కాంగ్రెస్ నేతలను బండ బూతులు తిట్టిన జేసీ దివాకర్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ఆ పార్టీ మాజీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి సరదాగా విరుచుకుపడ్డారు.

news18-telugu
Updated: December 9, 2019, 7:46 PM IST
తెలంగాణ కాంగ్రెస్ నేతలను బండ బూతులు తిట్టిన జేసీ దివాకర్ రెడ్డి
రేవంత్ రెడ్డితో జేసీ దివాకర్ రెడ్డి
  • Share this:
రాజకీయాల్లో సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డిది వినూత్న శైలి. ఎవరినైనా విమర్శించడం, ఎవరిపైనైనా పొగడ్తలు కురిపించడంలో ఆయన స్టయిలే వేరు. ఈ మధ్యకాలంలో ఏపీ సీఎం జగన్‌కు టార్గెట్‌గా మారిపోయామని చెప్పుకుంటున్న జేసీ దివాకర్ రెడ్డి... బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ గూటికి చేరేందుకు ఆయన ఏకంగా ఢిల్లీ వరకు వెళ్లొచ్చారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే... త్వరలోనే ఆయన కూడా మెడలో బీజేపీ కండువా వేసుకుని రాయలసీమలో సరికొత్త రాజకీయం మొదలుపెడతారని ఊహాగానాలు మొదలయ్యాయి.

జేసీ దివాకర్ రెడ్డి పార్టీ మారడం సంగతి అలా ఉంచితే... ఉన్నట్టుండి ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి రావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి జేసీ దివాకర్ రెడ్డి అనుకోని అతిధిగా వచ్చారు. కొద్దిసేపు అక్కడ సందడి చేశారు. రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేతలు షబ్బీర్ అలీ వంటి వారితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలపై సరదాగా విరుచుకుపడ్డారు. మీరు నాశనమై... మమ్మల్ని నాశనం చేశారని అన్నారు. రేవంత్ రెడ్డితోనూ ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. అయితే దానికి రిపేర్లు చేద్దామని రేవంత్ రెడ్డి జేసీ దివాకర్ రెడ్డితో అన్నారు.


First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>