మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మరో షాక్

తాడిపత్రిలోని జేసీ కుటుంబానికి ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్న ఎస్‌వీ రవీంద్రారెడ్డిపై జిల్లా బహిష్కరణకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.

news18-telugu
Updated: December 5, 2019, 6:38 PM IST
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మరో షాక్
టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి
  • Share this:
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ రాజకీయంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీనిపై జేసీ దివాకర్ రెడ్డి బహిరంగంగానే ఏపీలోని అధికార వైసీపీపై విమర్శలు గుప్పించారు. తాజాగా జేసీ ఫ్యామిలీకి రాజకీయంగా మరో షాక్ తగలబోతోందనే టాక్ వినిపిస్తోంది. తాడిపత్రిలోని జేసీ కుటుంబానికి ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్న ఎస్‌వీ రవీంద్రారెడ్డిపై జిల్లా బహిష్కరణకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. మరికొద్ది రోజుల్లోనే దీనిపై అదేశాలు రాబోతున్నాయని తెలుస్తోంది. సంగటి రవీంద్రారెడ్డి అలియాస్ పొట్టి రవి 2003లో జేసీ కుటుంబం చెంతకు చేరాడు. నమ్మిన బంటుగా మారాడు.

హత్యాయత్నాలు, దొమ్మిలు, మారణాయుధులు కలిగి ఉండడం వంటి వ్యవహారాల్లో పొట్టి రవిపై 11 కేసులు ఉన్నాయి. 2015లో అల్ట్రాటెక్ట్‌ సిమెంట్‌ పరిశ్రమలో సామగ్రిని ధ్వంసం చేసిన కేసు, 2017లో తాడిపత్రి మండలం, పెద్దపొలమడ గ్రామం సమీపంలోని ప్రభోదానంద ఆశ్రమానికి చెందిన వాటర్‌ ట్యాంక్‌ దగ్ధం కేసులో రవీంద్రారెడ్డి నిందితుడిగా ఉన్నాడు.2018లో వినాయక చవితి నిమజ్జన సందర్భంగా చేలరేగిన ఘర్షణలో కేసులు రవిపై నమోదు అయ్యాయి. తాడిపత్రిలో శాంతిభద్రతలకు పొట్టి రవి విఘాతం కలిగిస్తున్నారన్న నిర్దారణకు వచ్చిన పోలీసులు అతడిని జిల్లా నుంచి బహిష్కరించేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ఇదే జరిగితే ఇప్పటికే తాడిపత్రిలో రాజకీయంగా ఇబ్బందిపడుతున్న జేసీ ఫ్యామిలీకి ఇది మరో ఎదురుదెబ్బ కానుందనే టాక్ వినిపిస్తోంది.


First published: December 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు