news18-telugu
Updated: November 18, 2020, 2:53 PM IST
జేసీ దివాకర్ రెడ్డి (ఫైల్ ఫోటో)
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రగడ కొనసాగుతుంది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేనట్టుగా తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, పులువురు మంత్రులు అంటున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తీవ్రమైన చర్చ సాగుతుంది. ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి తాజా పరిణామాలపై సంచనల వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాత్రమే ఎన్నికలు జరపలేదని.. అందుకు ప్రభుత్వం నుంచి సహకారం ఉండాలని అన్నారు. అధికారులకు డబ్బులు సమకూర్చాల్సింది ప్రభుత్వమేనని చెప్పారు. ఎన్నికలు సంఘం చెప్పినట్టుగా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. తాను అనుకున్నది జరగడానికి సీఎం ఎంత దూరమైనా వెళ్తారని అన్నారు. ప్రభుత్వం ఎన్నికలు జరపకూడదన్న ఉద్దేశంతో ఉందన్నారు.
ఇక, మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బుధవారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కలిశారు. ఈ సందర్బంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవశ్యకతను, ఎన్నికలపై ఇప్పటివరకు చేపట్టిన చర్యలను గవర్నర్‌తో రమేశ్‌కుమార్ చర్చించినట్టుగా సమాచారం. మరోవైపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే యోచనలో ఎస్ఈసీ ఉన్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి.
Published by:
Sumanth Kanukula
First published:
November 18, 2020, 2:51 PM IST