నాపై ఎవరి ఒత్తిళ్లు లేవు.. స్వచ్చందంగానే వైసీపీలో చేరా : జేసీ అనుచరుడు

జేసీ బ్రదర్స్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవహారాలు కూడా షబ్బీర్ భాషానే చూసుకునేవాడు. షబ్బీర్ పార్టీ మారడంపై జేసీ బ్రదర్స్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

news18-telugu
Updated: November 20, 2019, 1:35 PM IST
నాపై ఎవరి ఒత్తిళ్లు లేవు.. స్వచ్చందంగానే వైసీపీలో చేరా : జేసీ అనుచరుడు
తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరుతున్న జేసీ బ్రదర్స్ అనుచరులు
  • Share this:
జేసీ బ్రదర్స్‌ ప్రధాన అనుచరుడు షబ్బీర్ భాషా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఆయనతో పాటు జేసీ బ్రదర్స్ అనుచరులు దాదాపు 500 మంది వైసీపీలో చేరారు. తనపై ఎవరి ఒత్తిళ్లు లేవని.. స్వచ్చందంగానే పార్టీలో చేరానని షబ్బీర్ తెలిపారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేసిన అభివృద్ది కార్యక్రమాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్టు చెప్పారు. ఇన్నాళ్లు జేసీ బ్రదర్స్‌కు కుడిభుజంగా పనిచేసిన షబ్బీర్ భాషా వైసీపీలో చేరడం వారికి పెద్ద దెబ్బే అంటున్నారు. జేసీ బ్రదర్స్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవహారాలు కూడా షబ్బీర్ భాషానే చూసుకునేవాడు. షబ్బీర్ పార్టీ మారడంపై జేసీ బ్రదర్స్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.ఇదిలా ఉంటే,ఇటీవల దివాకర్ ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే.పర్మిట్లు లేకపోయినా బస్సులు నడుపుతున్నారని కొన్ని బస్సులపై కేసులు నమోదు చేశారు. దీంతో తాత్కాలికంగా ట్రావెల్స్‌ను ఆపేస్తున్నట్టు జేసీ ప్రకటించారు.

First published: November 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>