ఆయనకు మహిళల శాపం... జయప్రద సంచలన వ్యాఖ్యలు

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న జయప్రద సంచలన వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: October 18, 2019, 12:12 PM IST
ఆయనకు మహిళల శాపం... జయప్రద సంచలన వ్యాఖ్యలు
జయప్రద(ఫైల్ ఫోటో)
  • Share this:
సమాజ్‌వాదీ పార్టీ ముఖ్యనేత, రాంపూర్ ఎంపీ ఆజం ఖాన్‌పై బీజేపీ నేత, మాజీ ఎంపీ జయప్రద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆజం ఖాన్ వల్ల ఎంతో మంది మహిళలు కన్నీరు పెట్టుకున్నారని... వారి శాపాలు ఆయనకు తగిలాయని జయప్రద విమర్శించారు. మహిళల కారణంగానే ఆయనపై భూ కబ్జా కేసులు నమోదయ్యాయని ఆరోపించారు. అందుకే ఆయన ఇప్పుడు ఎన్నికల సభల్లో ఏడుస్తున్నారని జయప్రద మండిపడ్డారు. ఒకప్పుడు తనను మంచి నటి అంటూ సెటైర్లు వేసిన ఆజం ఖాన్‌పై జయప్రద తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సభల్లో ఆయన తనకంటే బాగా నటిస్తున్నారని ఎద్దేవా చేశారు.

రాంపూర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల సభలో పాల్గొన్న జయప్రద... ఈ వ్యాఖ్యలు చేశారు. జయప్రద, ఆజంఖాన్ మధ్య చాలా కాలం నుంచి రాజకీయ వైరం కొనసాగుతోంది. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ... ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో కొనసాగాయి. గతంలో సమాజ్‌వాదీ పార్టీ తరపున రాంపూర్ ఎంపీగా విజయం సాధించిన జయప్రద... గత లోక్ సభ ఎన్నికల్లో రాంపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జయప్రదపై ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆజం ఖాన్... ఆమెపై విజయం సాధించారు.
First published: October 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు