జయలలిత వారసులు వాళ్లే.. ఆస్తులు ఎన్నంటే..

జయలలిత (ఫైల్ ఫోటో)

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత వారసులను మద్రాసు హైకోర్టు తేల్చేసింది. ఆమె మేనల్లుడు దీపక్, మేన కోడలు దీప మాత్రమే జయలలితకు లీగల్ హెయిర్స్‌గా ప్రకటించింది. అయితే, ఇప్పుడు జయలలిత ఆస్తులపై చర్చ నడుస్తోంది.

  • Share this:
    తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత వారసులను మద్రాసు హైకోర్టు తేల్చేసింది. ఆమె మేనల్లుడు దీపక్, మేన కోడలు దీప మాత్రమే జయలలితకు లీగల్ హెయిర్స్‌గా ప్రకటించింది. అయితే, ఇప్పుడు జయలలిత ఆస్తులపై చర్చ నడుస్తోంది. దీపక్‌‌‌‌‌‌‌‌, దీప చెప్పిన ప్రకారం రూ.188 కోట్లు, తమిళనాడు సర్కారు రూ.913 కోట్లుగా నిర్ధారించగా, విచారణ సందర్భంగా ఆ ఆస్తుల విలువ రూ.వెయ్యి కోట్లకు పైగా ఉంటున్నట్లు తెలుస్తోంది. జయలలిత ఫేవరెట్‌‌‌‌‌‌‌‌ సమ్మర్‌‌‌‌‌‌‌‌ ట్రీట్‌‌‌‌‌‌‌‌ అయిన కొడనాడ్‌‌‌‌‌‌‌‌ టీ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌ 900కు పైగా ఎకరాల్లో ఉంది. ఆ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌ను 1992లో ఆమె కొన్నారు. దాని విలువ ఎకరాకు రూ.కోటి ఉంటుందని చెబుతున్నారు. తన ఫ్రెండ్ శశికళ, ఇతర అసోసియేట్స్‌‌‌‌‌‌‌‌తో కలిసి 32 కంపెనీలను ఆమె ప్రారంభించారు. వాటి వివరాలు పెద్దగా తెలీదు. సుమారు 173 ప్రాపర్టీల్లో కనీసం 100 వాటిల్లో జయలలిత భాగస్వామిగా ఉన్నారు. ఆమె వద్ద రూ.5.53 కోట్ల విలువైన జువెల్లరీ, వెండి బట్టలు, రూ.4 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి.

    ఇక.. సినిమాల్లో నటిస్తున్న టైమ్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో కొన్ని విలువైన ఆస్తులను జయలలిత కొన్నారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని కొంపల్లిలో ఉన్న 14 ఎకరాల జేజే గార్డెన్ ఫామ్ హౌజ్ ఉంది. బత్తాయి, ద్రాక్ష తోటలతో ఆ ఫామ్‌‌‌‌‌‌‌‌ హౌజ్‌‌‌‌‌‌‌‌ను అందంగా తీర్చిదిద్దారు. వెస్ట్ మారేడ్‌‌‌‌‌‌‌‌పల్లిలోని రాధిక కాలనీలో జయలలితకు సొంతిల్లు ఉంది. శ్రీనగర్ కాలనీలో 600 గజాల్లో ఓ ఇంటిని కొన్నారని సమాచారం.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: