బీజేపీలోకి సినీ నటి జయప్రద... అజాంఖాన్‌పై పోటీ ?

భారతీయ జనతా పార్టీలో చేరేందుకు మాపీ ఎంపీ జయప్రద రంగం సిద్ధం చేసుకున్నారు. ఈరెండు రోజుల్లో ఆమె పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

news18-telugu
Updated: March 29, 2019, 6:30 PM IST
బీజేపీలోకి సినీ నటి జయప్రద... అజాంఖాన్‌పై పోటీ ?
జయప్రద సీనియర్ నటి
  • Share this:
సార్వత్రిక ఎన్నికల వేళ ప్రముఖ నటి ,మాజీ ఎంపీ జయప్రద పార్టీ మారుతారన్న వార్తలు వనిపిస్తున్నాయి. ఆమె బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో సమాజ్‌వాదీ పార్టీలో ఉన్న ఆమె.. తర్వాత బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అమర్ సింగ్ శిష్యురాలిగా ఉన్న ఆమె.. ఇప్పటికే రెండుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్ రాంపూర్ నియోజకవర్గం నుంచి సమాజ్ వాదీ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నారు. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 2019, మార్చి 25వ తేదీ సాయంత్రం లేదా 26వ తేదీ అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తోన్నాయి.

2004 నుంచి 2014 వరకు రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎస్పీ తరపున జయప్రద ఎంపీగా కొనసాగారు. ఇప్పుడీ స్థానం నుంచి ఆజంఖాన్‌ పోటీకి దిగారు. ఇప్పుడదే పార్టీకి చెందిన ఆజంఖాన్‌పై జయప్రద పోటీ చేస్తారని తెలుస్తోంది. అయితే ఆజంఖాన్‌పై ఆమె గతంలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆయనను చూస్తుంటే అల్లావుద్దీన్ ఖిల్జీ గుర్తొస్తున్నాడని ఆమె అన్నారు. యూపీ ప్రజలకు జయప్రద సుపరిచితురాలు. పదేళ్లు ఎంపీగా ఉన్నారు. ములాయంసింగ్ యాదవ్ పార్టీ అయిన సమాజ్ వాదీ పార్టీ తరపున గత ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు.

పార్టీ పగ్గాలు అఖిలేష్ యాదవ్ చేతిలోకి వచ్చిన తర్వాత అమర్ సింగ్ ప్రాబల్యం తగ్గింది. దీంతో జయప్రద కూడా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. యూపీలో ఎస్సీ-బీఎస్పీ పొత్తు పెట్టుకున్నాయి. బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగుతుంది. కీలక నేతలకు వల వేస్తోంది బీజేపీ. ఈ క్రమంలోనే జయప్రదతో సంప్రదింపులు జరిపింది బీజేపీ. అయితే పార్టీ ప్రచారానికే పరిమితం అవుతారా లేక ఎంపీగా బరిలోకి దిగుతారా అనేది చూడాలి. బీజేపీ వర్గాలు మాత్రం పోటీకి దించుతాం అని అంటున్నారు.

ఇవికూడా చదవండి:అ,ఆలు రావు కానీ... నారా లోకేష్‌పై వైఎస్ షర్మిల సెటైర్లు

Video : జై తెలంగాణ అంటే చెయ్యి ఎత్తని ఏకైక వ్యక్తి చంద్రబాబు :

కవిత పులివెందుల సీఐపై వివేకా కూతురు సంచలన వ్యాఖ్యలు
First published: March 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>