Jaya Prada: సొంత పార్టీవాళ్లే ముంచారు...అగ్రనేతలకు ఫిర్యాదు చేస్తానన్న జయప్రద

Election Results 2019: బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన జయప్రదకు 4,49,180 ఓట్లు(42.3శాతం) దక్కగా...అజంఖాన్‌కు 5,59,177(52.7శాతం) ఓట్లు పోల్ అయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ కపూర్‌కి 35,009 ఓట్లు దక్కాయి.

news18-telugu
Updated: May 24, 2019, 5:59 PM IST
Jaya Prada: సొంత పార్టీవాళ్లే ముంచారు...అగ్రనేతలకు ఫిర్యాదు చేస్తానన్న జయప్రద
జయప్రద
news18-telugu
Updated: May 24, 2019, 5:59 PM IST
యూపీలోని రాంపూర్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి, సినీ నటి జయప్రద పరాజయం పాలయ్యారు. ఆమెపై సమాజ్‌వాది పార్టీ నేత అజం ఖాన్ 1,09,997 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జయప్రదకు 4,49,180 ఓట్లు(42.3శాతం) దక్కగా...అజంఖాన్‌కు 5,59,177(52.7శాతం) ఓట్లు పోల్ అయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ కపూర్‌కి 35,009 ఓట్లు దక్కాయి. ఎన్నికల ప్రచార సందర్భంగా జయప్రదపై అజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. గురువారం చేపట్టిన ఓట్ల లెక్కింపులో అజంఖాన్ విజయం సాధించారు.

లోక్‌సభ ఎన్నికల్లో తన ఓటమికి సొంత పార్టీ(బీజేపీ) నేతలే కారణమని జయప్రద ఆరోపించారు. ప్రత్యర్థులకు ఎవరెవరు సహకరించారో పార్టీ అగ్రనేతలకు చెబుతానని చెప్పారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు జయప్రద తెలిపారు.



First published: May 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...