హోమ్ /వార్తలు /రాజకీయం /

వారణాసిలో మోదీపై ఆ జవాన్ పోటీ...టికెట్ ఇచ్చిన సమాజ్‌వాదీ

వారణాసిలో మోదీపై ఆ జవాన్ పోటీ...టికెట్ ఇచ్చిన సమాజ్‌వాదీ

ప్రధాని మోదీ, తేజ్ బహదూర్

ప్రధాని మోదీ, తేజ్ బహదూర్

వారణాసిలో తన గెలుపుపై ధీమాగా ఉన్నారు తేజ్ బహదూర్. తనకు ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ అండదండలతో పాటు సుమారు పది వేల మంది రిటైర్డ్ సైనికుల మద్దతు ఉందని స్పష్టంచేశారు.

    ప్రధాని మోదీ ఇలాఖా వారణాసిలో ఎన్నికల రాజకీయాలు వేడెక్కాయి. ఆఖరి క్షణంలో సమాజ్‌వాదీ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. వారణాసిలో మోదీపై పోటీచేసే అభ్యర్థిని అనూహ్యంగా మార్చింది. షాలినీ యాదవ్ స్థానంలో బీఎస్ఎఫ్ మాజీ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్‌కు టికెట్ ఇచ్చి.. ఆ వెంటనే బీఫారం అందజేశారు. వారణాసిలో నామినేషన్ల దాఖలు ఇవాళే చివరి రోజు కావడంతో.. హడావిడిగా తేజ్‌బహదూర్‌తో నామినేషన్ వేయించారు. వారణాసిలో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాద్ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా తేజ్ బహదూర్ పోటీచేస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం.. దేశరాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.



    వారణాసిలో కాంగ్రెస్ తరపున రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ పోటీచేస్తారని ప్రచారం జరిగింది. కానీ తాను పోటీచేయడం లేదని స్పష్టంచేయడంతో.. సమాజ్‌వాదీ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహించి మాజీ జవాన్‌ను రంగంలోకి దించింది. దాంతో వారణాసిలో పోరు చౌకీదార్ vs జవాన్‌గా మారింది. వారణాసిలో నామినేష్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన తేజ్ బహదూర్...పార్లమెంట్‌లో రైతులు, జవాన్ల తరుపున గొంతుక వినిపించడమే తన లక్ష్యమన్నారు.

    నేను ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిని. పార్టీ గుర్తుపై నామినేషన్ దాఖలు చేశా. దేశ సైనికులు, రైతుల కోసమే మేం పోరాడుతున్నాం.
    తేజ్ బహదూర్
    సమాజ్‌వాద్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రశంసించారు. ఓ వైపు దేశ కోసం పోరాడిన జవాన్, మరోవైపు జవాన్లను ఉద్యోగాలను తొలగిస్తున్న మోదీ ఉన్నారని..వారణాసిలో టఫ్ ఫైట్ నెలకొందని ట్వీట్ చేశారు.


    గతంలో బీఎస్ఎఫ్ జవాన్‌గా పనిచేసిన తేజ్ బహదూర్..ఇండియన్ ఆర్మీపై సంచలన ఆరోపణలు చేశారు. జవాన్లకు వడ్డించే ఆహారంలో నాణ్యత లేదని వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానిపై అప్పట్లో తీవ్ర దుమారం చెలరేగింది. కేంద్రం ఆదేశాల మేరకు క్రమశిక్షణా చర్యలు తీసుకున్న ఆర్మీ.. 2017లో అతడిని విధుల నుంచి తొలగించింది. వారణాసిలో తన గెలుపుపై ధీమాగా ఉన్నారు తేజ్ బహదూర్. తనకు ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ అండదండలతో పాటు సుమారు పది వేల మంది రిటైర్డ్ సైనికుల మద్దతు ఉందని స్పష్టంచేశారు.


    First published:

    Tags: Bjp, Pm modi, Samajwadi Party, Sp-bsp, Uttar Pradesh Lok Sabha Elections 2019, Varanasi S24p77

    ఉత్తమ కథలు