Home /News /politics /

JARKHAND MINISTER WHO INTRODUCED TRAFFIC TRACKER FINED RS 100 BY SAME SYSTEM MS

ఆ మంత్రి తీసుకొచ్చిన సిస్టమ్ ఆయన్నే పట్టించింది..

జార్ఖండ్ మంత్రి సీపీ సింగ్

జార్ఖండ్ మంత్రి సీపీ సింగ్

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడంతో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్(ANPR) ద్వారా ఆయన ఇంటికి చలాన్ వెళ్లింది. సింగ్ కారు డ్రైవర్ చలానా చెల్లించేందుకు రావడంతో విషయం వెలుగుచూసింది.

    రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్.. అని ఒక నానుడి. సామాన్యుడైనా.. అమాత్యులైనా.. అంతా రూల్స్‌కు కట్టుబడి ఉండాల్సిందే.తాజాగా జార్ఖండ్‌లోనూ ఇదే జరిగింది. జార్ఖండ్ రాష్ట్రంలోట్రాఫిక్ మూవ్‌మెంట్ ట్రాకింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టిన రవాణా మంత్రి సీపీ సింగ్.. అదే సిస్టమ్ చేతిలో బుక్కయ్యారు.ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆయనకు రూ.100 జరిమానా విధించారు. జూన్ 23న రాంచీలోని సర్జన చౌక్ వద్ద సిగ్నల్స్‌ను లెక్క చేయకుండా వెళ్తున్న సింగ్ కారును ట్రాఫిక్ మూవ్‌మెంట్ ట్రాకింగ్ సిస్టమ్ ట్రాక్ చేయడంతో ఆయనకు జరిమానా తప్పలేదు.ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడంతో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్(ANPR) ద్వారా ఆయన ఇంటికి చలాన్ వెళ్లింది. సింగ్ కారు డ్రైవర్ చలానా చెల్లించేందుకు రావడంతో విషయం వెలుగుచూసింది. ఇదే విషయంపై స్పందించిన సింగ్.. తప్పును ఒప్పుకున్నారు. సామాన్య ప్రజలు రూల్స్ పాటించాలంటే.. మంత్రులు కూడా రూల్స్‌కు కట్టుబడి
    ఉండాలని చెప్పారు.

    కాగా, వాహనదారులు రాల్స్ అతిక్రమించినప్పుడు.. ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అడ్డుపడితే ఇరువురి మధ్య వాగ్వాదానికి దారితీసిన ఘటనలు బోలెడు. కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ కానిస్టేబుల్స్ సిగ్నల్స్ జంప్ చేసినవారిని పట్టుకునేందుకు ప్రయత్నించి ప్రమాదాలకు గురైన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సీపీ సింగ్ ట్రాఫిక్ మూవ్‌మెంట్ ట్రాకింగ్ సిస్టమ్‌ను తీసుకొచ్చారు. ఇందులో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడింగ్ సిస్టమ్‌తో పాటు రెడ్ లైట్ వయొలేషన్ డిటెక్షన్ సిస్టమ్ ఉంటాయి.ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించేవారు ఈ సిస్టమ్‌తో ఈజీగా దొరికిపోతారు. మంత్రి సీపీ సింగ్ కూడా వీటితోనే బుక్కయ్యారు.
    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: Jarkhand, Traffic, Traffic rules

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు