బీజేపీకి గుడ్ బై చెప్పేస్తా... పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు...

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేతో ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ పొత్తు పెట్టుకుంటే తాను బీజేపీకి గుడ్ బై చెబుతానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

news18-telugu
Updated: February 15, 2020, 7:23 PM IST
బీజేపీకి గుడ్ బై చెప్పేస్తా... పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు...
అమరావతిలో పవన్ కళ్యాణ్
  • Share this:
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేతో ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ పొత్తు పెట్టుకుంటే తాను బీజేపీకి గుడ్ బై చెబుతానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అమరావతిలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. ‘పొత్తు కుదిరిపోయిందనే ప్రచారం పచ్చి అబద్ధం. వైసీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే అందులో నేను ఉండను. దానికి కారణం కూడా చెబుతా. బీజేపీ అలా చేస్తుందని నేను చెప్పడం లేదు. చెయ్యదు కాబట్టే ఇంత స్పష్టంగా చెబుతా. అక్కడ పొత్తు లేదు. మహనీయుల అడుగుజాడల్లో నడిచి అన్యాయానికి గురవుతున్న వారికి అండగా ఉండడానికి రాజకీయాల్లోకి వచ్చా. అంతేకానీ, వారితో ఓట్లు వేయించుకుని వారిని తొక్కేయడానికి రాజకీయాల్లోకి రాలేదు. మీకు అండగా ఉందాం. భుజం కాద్దాం. కాపు కాద్దాం. అని రాజకీయాల్లోకి వచ్చా. జనసేన మీకు అండగా ఉంటుంది. అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని. వీళ్లు వెళ్లి మార్చుకున్నామని ప్రకటించినా... ఎక్కడికి వెళ్లినా రాజధానిని తిరిగి తీసుకొచ్చి అమరావతిలో పెట్టిస్తాం. హైకోర్టు మాత్రం కర్నూలులో పెడతామని బీజేపీ చెప్పింది కాబట్టి దానికి మాత్రం నేను హామీ ఇవ్వలేదు.’ అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

#PawanKalyan, JanaSena, JanaSenaParty, Janasena, APCapitals, ApcapitalIssue, Vizag, Amaravathi, Kurnool
పవన్ కళ్యాణ్


అమరావతిలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్‌ను అనంతవరం, తుళ్లూరు, మందడంలో మహిళా రైతులు ప్రశ్నించారు. బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుందని, అలాంటి సమయంలో ఇప్పుడు బీజేపీతో వైసీపీ కూడా పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారంపై మహిళలు జనసేననాని నిలదీశారు. దీనిపై రెండు సభల్లో స్పందించిన పవన్ కళ్యాణ్ మందడంలో జరిగిన సభలో మాత్రం ఆయన క్లారిటీ ఇచ్చారు. బీజేపీ, వైసీపీ పొత్తు పెట్టుకుంటే తనకేం అభ్యంతరం లేదని, అయితే, అందులో తాను మాత్రం అందులో ఉండనని స్పష్టం చేశారు.

First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు