బీజేపీలో జనసేన విలీనం... మాజీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు

మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నేత అన్నం సతీష్ జనసేన, పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

news18-telugu
Updated: September 4, 2019, 1:05 PM IST
బీజేపీలో జనసేన విలీనం... మాజీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు
పవన్ కల్యాణ్ ( ట్విట్టర్ )
news18-telugu
Updated: September 4, 2019, 1:05 PM IST
ఏపీకి చెందిన బీజేపీ నేత అన్నం సతీష్ కీలక వ్యాఖ్యలు చేశారు. బహిరంగ వేదికపై కళ్యాణ్ సీఎం కావాలంటూ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉందని అన్నారు. డిసెంబర్‌లోగా జనసేన బీజేపీలో కలుస్తుందని జోస్యం చెప్పారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వస్తారని... ఢిల్లీ నాయకులు కూడా రాష్ట్రానికి వస్తారని అన్నం సతీష్ వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన వస్తుందని సీఎం జగన్ జాగ్రత్త పడుతున్నారని అన్నం సతీష్ అన్నారు. తనది స్టేట్ పార్టీ కాదని... సెంట్రల్ పార్టీ అని ఆయన స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ బీజేపీలో చేరితే ఆయనకు పెద్ద ఎనర్జీ వస్తుందని...ఆ తరువాత ఆయనను ఎవ్వరూ ఆపలేరని అన్నారు. ప్రత్యామ్నాయం వచ్చిన రోజు ఎవరు బ్యాక్ బోన్ అనేది తెలుస్తుందని అన్నం సతీష్ అన్నారు.

జనసేనను ఏ పార్టీలో విలీనం చేయబోనని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇస్తున్నా... ఆ పార్టీ ఇతర పార్టీలో విలీనమవుతుందనే ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా అన్నం సతీష్ వ్యాఖ్యలతో బీజేపీలో జనసేన విలీనం అవుతుందా అనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. మరోవైపు అన్నం సతీష్ వ్యాఖ్యలపై జనసేన ఏరకంగా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.


First published: September 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...