పవన్ కళ్యాణ్‌పై దుష్ప్రచారం... గతంలో జనసేనలో పనిచేసిన వారే...

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పార్టీ నేతలను కించపరుస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేసే వారిపై లీగల్ యాక్షన్ తీసుకోవాలని జనసేన పార్టీ నిర్ణయించింది.

news18-telugu
Updated: February 26, 2020, 3:45 PM IST
పవన్ కళ్యాణ్‌పై దుష్ప్రచారం... గతంలో జనసేనలో పనిచేసిన వారే...
పవన్ కళ్యాణ్
  • Share this:
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పార్టీ నేతలను కించపరుస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేసే వారిపై లీగల్ యాక్షన్ తీసుకోవాలని జనసేన పార్టీ నిర్ణయించింది. గతంలో పార్టీలో పనిచేసి ఆ తర్వాత ఇతర పార్టీలకు వెళ్లిన వారు సోషల్ మీడియా వేదికగా జనసేన మీద దుష్ప్రచారం చేస్తున్నారని పార్టీ దృష్టికి వచ్చింది. దీంతో వారిపై చర్యలు తీసుకోవాలని జనసేన లీగల్ సెల్ నిర్ణయించింది. ‘గతంలో పార్టీలో ఉండి.. ఆపై ఇతర పార్టీలకు అమ్ముడుపోయి ఇప్పటికీ పార్టీలో ఉన్నామని చెప్పుకొంటూ కొందరు సామాజిక మాధ్యమాలలో పార్టీని, పార్టీ విధానాలను, ముఖ్య నాయకులను, కార్యనిర్వాహకులను కించపరుస్తూ ఉన్నారు. సామాజిక మాధ్యమాలలో ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్న విషయం పార్టీ దృష్టికి చేరింది. పార్టీ సిద్ధాంతాలపై గౌరవంగానీ, అధ్యక్షుల వారిపై అభిమానంగానీ లేనివారే ఈ తరహా వ్యాఖ్యలకు దిగుతున్నారు. దురుద్దేశపూర్వకంగానే ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారు. ఇటువంటి వారిని ఉపేక్షించకూడదని పార్టీ లీగల్ సెల్ నిర్ణయించింది. రెండు మూడు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో లైవ్ వీడియోలు పెడుతూ, ఫేస్ బుక్, వాట్సప్ ల్లో పోస్టులు పెడుతూ దుష్ప్రచారం చేస్తున్న విషయం లీగల్ సెల్ గుర్తించింది. ఈ విధమైన తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు అవసరమైన ప్రక్రియను చేపడతాం. ముందుగా లీగల్ నోటీసులు జారీ చేసి, తదుపరి క్రిమినల్ కేసులు పెట్టాలని నిర్ణయించాం.’ అంటూ ఓ ప్రకటన జారీ చేసింది.

First published: February 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు