Home /News /politics /

JANASENA WANTS MAHBUBNAGAR RANGAREDDY HYDERABAD TRS MLC CANDIDATE SURABHI VANI SHOULD WIN A SHOCK FOR BJP AK

బీజేపీకి బిగ్ షాక్.. టీఆర్ఎస్‌కు జై కొట్టిన జనసేన.. ఏం జరుగుతోంది ?

పవన్ కళ్యాణ్, అమిత్ షా (ఫైల్ ఫోటో)

పవన్ కళ్యాణ్, అమిత్ షా (ఫైల్ ఫోటో)

Janasena-BJP: మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గం బీజేపీకితో ఎంతో ప్రతిష్టాత్మకమైన స్థానం. ఇది బీజేపీ సిట్టింగ్ స్థానం కావడంతో.. మళ్లీ తమ సీటును నిలుపుకోవడం కోసం ఆ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది.

    ఏపీలో బీజేపీతో కలిసి రాజకీయ ప్రయాణం సాగించాలని నిర్ణయించుకున్న జనసేన.. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పొత్తులతోనే ముందుకు సాగుతోంది. అయితే బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ.. సొంతంగానే రాజకీయంగా ఎదగాలని ప్లాన్ చేసుకుంటున్న జనసేన.. అందుకు తగ్గట్టుగా వ్యూహరచన చేస్తోంది. ఇక తెలంగాణలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన జనసేన.. చివరి నిమిషంలో బీజేపీకి మద్దతిచ్చి పోటీ నుంచి తప్పుకుంది. దీంతో ఇక తెలంగాణలో జనసేన పోటీ చేసే అవకాశం ఉండదని.. ఇక్కడ ఏ ఎన్నిక జరిగినా జనసేన మద్దతు బీజేపీకే అని అంతా భావించారు. అయితే ఉన్నట్టుండి తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన బీజేపీకి హ్యాండ్ ఇచ్చి టీఆర్ఎస్‌కు జై కొట్టడం చర్చనీయాంశంగా మారింది.

    మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన మాజీ ప్రధాని పీవీ కుమార్తె సురభి వాణి దేవి గెలవాలని కోరుకుంటున్నట్టు జనసేనకు చెందిన సోషల్ మీడియా బృందం జనసేన శతఘ్ని పోస్ట్ పెట్టడం రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.



    మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గం బీజేపీకితో ఎంతో ప్రతిష్టాత్మకమైన స్థానం. ఇది బీజేపీ సిట్టింగ్ స్థానం కావడంతో.. మళ్లీ తమ సీటును నిలుపుకోవడం కోసం ఆ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇక్కడి నుంచి రెండోసారి పోటీ చేస్తున్న రామచంద్రరావు.. మరోసారి గెలుపు తనదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో జనసేన టీఆర్ఎస్ అభ్యర్థి గెలవాలని కోరుకోవడం కొత్త చర్చకు తెరలేపుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Bjp, Janasena, Telangana, Trs

    తదుపరి వార్తలు