పవన్ కల్యాణ్ నిర్బంధం.. జనసేన సంచలన నిర్ణయం

మందడం గ్రామంలో పోలీసుల దుశ్చర్యలో గాయపడిన మహిళలను పరామర్శించనీయకుండా నియంత్రించడం ప్రజాస్వామ్యాన్ని మంటకలపడమేనని ఓ ప్రకటన విడుదల చేసింది జనసేన.


Updated: January 21, 2020, 5:58 PM IST
పవన్ కల్యాణ్ నిర్బంధం.. జనసేన సంచలన నిర్ణయం
పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan)
  • Share this:
సోమవారం అమరావతిలోని జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌ని పోలీసులు నిర్బంధించిన ఘటనను ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. అంతేకాదు పోలీసులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సంచలన నిర్ణయం తీసుకుంది. మంగళవారం పవన్ కల్యాణ్‌తో జనసేన పార్టీ రాష్ట్ర న్యాయవిభాగం సమావేశమైంది. పలువురు నాయకులను సొంత పార్టీ కార్యాలయంలో నిర్బంధించడంపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సమావేశం తీర్మానించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. మందడం గ్రామంలో పోలీసుల దుశ్చర్యలో గాయపడిన మహిళలను పరామర్శించనీయకుండా నియంత్రించడం ప్రజాస్వామ్యాన్ని మంటకలపడమేనని పేర్కొంది.

కాగా, సోమవారం అమరావతి పరిధిలోని ఎర్రబాలెం, పెనుమాక, మందడం, గ్రామాల్లో పర్యటించాలనుకున్నారు. ఐతే వారి పర్యటనకు అనుమతి లేదంటూ జనసేన కార్యాలయం వద్దే అడ్డుకున్నారు పోలీసులు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు నాదెండ్ల మనోహర్‌ని సాయంత్రం 5 నుంచి రాత్రి 10.30 వరకు ఆఫీసులోనే నిర్బందించారు. ఈ ఘటనపై జనసేన నేతలు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: January 21, 2020, 5:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading