Janasena-TDP : టీడీపీ-జనసేన మధ్య కుదిరిన పొత్తు.. వైసీపీకి చెక్ పెట్టేందుకే..!

ప్రతీకాత్మక చిత్రం

పరిషత్ ఎన్నికల్లో (Parishath Elections) మెజారిటీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) దక్కించుకుంది. ఐతే కొన్నిచోట్ల తెలుగుదేశం (Telugu Desham Party), జనసేన పార్టీ (Janasena Party) లు తమ ప్రభావాన్ని చూపాయి.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల (MPTC, MPTC Elections) ఫలితాలు వెల్లడయ్యాయి. మెజారిటీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) దక్కించుకుంది. ఐతే కొన్నిచోట్ల తెలుగుదేశం (Telugu Desham Party), జనసేన పార్టీ (Janasena Party) లు తమ ప్రభావాన్ని చూపాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఈ రెండు జిల్లాల్లోనే జనసే పార్టీ దాదాపు 150 స్థానాలు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో అక్కడక్కడా ఎంపీపీ పదవులపై కన్నేసింది. ఐతే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేందుకు టీడీపీ-జనసేన పార్టీలు చేతులు కలిపాయి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు మండలాల్లో పరస్పర అవగాహనతో ఎంపీపీ స్థానాలు దక్కించుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కడియం, పశ్చిమగోదావరి జిల్లా ఆచంట ఎంపీపీ పదవి దక్కించుకునేందుకు ఈ రెండు పార్టీలు చేతులు కలిపాయి.

    టీడీపీకి ఎంపీపీ, జనసేనకు వైఎస్ ఎంపీపీ
    పశ్చిమగోదావరి జిల్లా (West Godavari District) ఆచంట మండలం ఎంపీపీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఇక్కడ టీడీపీ-జనసేనకు మధ్య సయోధ్య కుదిరింది. ఈ మండలంలో టీడీపీకి ఏడుగురు, వైసీపీకి ఆరుగురు, జనసేనకు నలుగురు ఎంపీటీసీలు ఉన్నారు. దీంతో మండల పరిషత్ ఛైర్మన్ పదవి కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. నాలుగు స్థానాలు గెలిచిన జనసేన పార్టీ కీలకంగా మారింది. ఎంపీపీని దక్కించుకునేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నించింది. మరోవైపు ఏడుగురు ఎంపీపీలున్న టీడీపీ, నాలుగు స్థానాల్లో గెలిచిన జనసేన మధ్య ఒప్పందం కుదిరింది. టీడీపీకి ఎంపీపీ, జనసేనకు వైఎస్ ఎంపీపీ పదవులు ఇచ్చుకునేలా ఒప్పందం చేసుకున్నాయి.

    ఇది చదవండి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. ఇకపై నెలరోజులే ఈ సౌకర్యం..


    జనసేన-టీడీపీ చెరిసగం..
    అటు తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) కడియంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కడియంలో మొత్తం 22 ఎంపీటీసీ స్థానాలుండగా.. ఒకటి వైసీపీ, మరొకటి జనసేనకు ఏకగ్రీవమయ్యాయి. జనసేన అభ్యర్థి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఫలితాలు వెల్లడైన 20 స్థానాల్లో 8 వైసీపీ, 8 జనసేన, నాలుగు టీడీపీ గెలిచాయి. ఏకగ్రీవమైన స్థానంతో కలిపి వైసీపీ బలం 9కి చేరింది. ఇప్పుడు ఎంపీపీ పదవిపై తీవ్ర పోటీ నెలకొంది. ఈ మండలంలో కూడా టీడీపీ-జనసేన మధ్య సయోధ్య కుదిరింది. ఎంపీపీ స్థానాన్ని వైసీపీకి దక్కకుండా చేసేందుకు రెండు పార్టీలు ఒప్పందానికి వచ్చాయి. పరిషత్ ఛైర్మన్ పదవిని రెండున్నరేళ్ల చొప్పున పంచుకోవాలని నిర్ణయించాయి. ఈ విషయాన్ని రెండు పార్టీల నేతలు స్పష్టం చేశారు.

    ఇది చదవండి: గుడివాడ సెంటర్లో తేల్చుకుందాం..! కొడాలి నానికి వంగవీటి రాధ సవాల్..? ప్రచారంలో నిజమెంత..?


    2014 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపెట్టుకున్న జనసేన-తెలుగుదేశం పార్టీలు ఆ తర్వాత విడిపోయిన సంగతి తెలిసిందే. టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆ తర్వాత 2019లో వామపక్షాలతో కలిసి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. ఐతే అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ-జనేసనకు మధ్య తెరవెనుక ఒప్పందం ఉన్నట్లు వైసీపీ నేతలు ప్రచారం చేసి సక్సెస్ అయింది. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పదవులు పంచుకోవడం చర్చనీయాంశమైంది.
    Published by:Purna Chandra
    First published: