Home /News /politics /

JANASENA SUPPORTERS WON NEELIPUDI PANCHAYAT WHERE PEDANA MLA JOGI RAMESH THREATENS VOTERS FOR CONTESTING AGAINST YSRCP HERE ARE THE DETAILS PRN

AP Panchayat Elections: వైసీపీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన జనసేన... పోటీ చేస్తే పథకాలు కట్ చేస్తామన్న చోటే గెలుపు

కృష్ణాజిల్లా నీలిపూడిలో జనసేన మద్దతుదారుల గెలుపు

కృష్ణాజిల్లా నీలిపూడిలో జనసేన మద్దతుదారుల గెలుపు

AP Panchayat Elections: పల్లెల్లో జరిగే పంచాయతీ (AP Panchayat Elections) ఎన్నికల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పది ఓట్లు పోయినా ఫలితంలో తేడా కొట్టేస్తుంది.

    ఎన్నికల ప్రచారం అంటే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రాజకీయా పార్టీలు, నేతలు నానా తంటాలు పడతారు. నయనో భయానో ఓటర్లను తమవైపుకు తిప్పుకునేందుకు యత్నిస్తారు. కొంచెం మాట తేడా వచ్చినా.. నోరు జారినా మనవి అనుకునే ఓట్లే గల్లంతవుతాయి. అందునా పల్లెల్లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పది ఓట్లు పోయినా ఫలితంలో తేడా కొట్టేస్తుంది. సరిగ్గా అలాంటి సీనే కృష్ణాజిల్లాలో చోటు చేసుకుంది. పెడన నియోజకవర్గ పరిధిలోని కృత్తివెన్ను మండలానికి చెందిన నీలిపూడి గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన కామెంట్ పెద్ద చిచ్చును రేపాయి. అధికార పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్లు వేస్తే ఆ ఇంట్లోవారికి సంక్షేమ పథకాలు కట్ చేస్తామంటూ  ఓ విధంగా బెదిరింపులకు గురిచేశారాయన.

    ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా రచ్చరేగడం... ఎస్ఈసీ ఆంక్షలు విధించడం.. ఆ తర్వాత ఆయన కోర్టుకెళ్లడం జరిగాయి. కోర్టులో స్టే తెచ్చుకున్నా.. ప్రజాకోర్టులో మాత్రం షాక్ తప్పలేదు. జోగి రమేష్ కామెంట్స్ చేసిన నీలిపూడి గ్రామంలో బెదిరింపులు పనిచేయలేదు. గ్రామంలోని 10కి 10 వార్డులు జనసేన మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. అంతేకాదు సర్పంచ్ స్థానాన్ని కూడా ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థే గెలుచుకున్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కోపమో.. లేక మరేదైనా కారణమో తెలియదు గానీ.. ఎమ్మెల్యే ప్రచారం చేసిన గ్రామంలోనే ఇలా జరగడం స్థానిక వైసీపీ నేతలకు షాక్ తగిలినట్లైంది. నీలిపూడి గ్రామంలో మొత్తం 1,408 ఓట్లు ఉండగా.. అందులో వెయ్యికి పైగా ఓట్లు జనసేన బలపరిచిన అభ్యర్థి పాశం కృష్ణకు పోలైనట్లు తెలుస్తోంది. 270 ఓట్ల వైసీపీ మద్దతుదారులకు దక్కినట్లు తెలుస్తోంది.

    ఇది చదవండి: చంద్రబాబు సొంత నియోజకవర్గంలో వింత పరిస్థితి... కుప్పంలో నో ఎలక్షన్స్...కారణం అదే



    ఎమ్మెల్యే ఏమన్నారంటే...
    వైఎస్ఆర్సీపీకి ఎవరైనా నామినేషన్లు వేస్తే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. బహిరంగ సభలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. ‘ఎవరైనా వైఎస్ఆర్సీపీ కాకుండా.. వేరే పార్టీ తరపున వార్డు మెంబర్ గా నిలబడితే ఊరుకునే ప్రసస్తే లేదన్నారు జోగి రమేష్. జగనన్న ఇస్తున్న పథకాలు తీసుకుంటూ వేరే పార్టీల్లో పోటీ చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని.., పెన్షన్, కాపునేస్తం అమ్మఒడి, ప్రతి పథకాన్నీ కూడా కట్ చేసిపారేస్తామని అందులో మొహమాటం లేదు’ అంటూ వ్యాఖ్యానించారు.

    ఇది చదవండి: విశాఖ స్టీల్ పై జగన్ కీలక వ్యాఖ్యలు.. కార్మికులకు ఇచ్చిన హామీ ఇదే..!


    ఇక పెడన నియోజకవర్గంలో జనసేన మద్దతదారులు ఇప్పటివరకు 11 పంచాయతీలను కైవసం చేసుకున్నారు. వాటిలో కంకటావ, ములపర్రు, కాకర్లమూడి, చోడవరం, బల్లిపర్రు, నీలిపూడి, ఉరిమి, నేలకొండపల్లి, కోమలపూడి,  ఆకులమన్నాడు, ముల్లపర గ్రామాలున్నాయి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap local body elections, AP News, Gram Panchayat Elections, Janasena, Janasena party, Jogi Ramesh, Krishna District, Local body elections, Pavan kalyan, Pawan kalyan, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు