Home /News /politics /

Janasena: జనసేనకు షాక్.. తిరుపతి ఉప ఎన్నిక వేళ పార్టీకి గుడ్ బై చెప్పిన సీనియర్ నేత..

Janasena: జనసేనకు షాక్.. తిరుపతి ఉప ఎన్నిక వేళ పార్టీకి గుడ్ బై చెప్పిన సీనియర్ నేత..

పవన్ కల్యాణ్‌తో మాదాస్ గంగాధరం(ఫైల్ ఫొటో)

పవన్ కల్యాణ్‌తో మాదాస్ గంగాధరం(ఫైల్ ఫొటో)

జనసేనకు ఆ పార్టీ సీనియర్ నేత మాదాసు గంగాధరం రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ రాశారు. అందులో పలు అంశాలను ఆయన ప్రస్తావించారు.

    తిరుపతి ఉప ఎన్నిక వేళ జనసేన పార్టీకి షాక్ తగిలింది. జనసేన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీలో సీనియర్లకు సముచిత గౌరవం ఇవ్వడంలేదని ఆయన అన్నారు. పార్టీ కోసం కష్టపడే వారిని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మాదాసు గంగాధరం లేఖ రాశారు. అందులో చాలా విషయాలను ఆయన ప్రస్తావించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిలుపుతో మూడేళ్ల క్రితం జనసేనలో చేరినట్టు తెలిపారు. అయితే పార్టీ బలోపేతానికి కష్టపడేవారికి గుర్తింపు లేదని పేర్కొన్నారు. పవన్ కల్యాన్ పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టలేదని.. కమిటీలు కూడా సరిగా లేవని అన్నారు. పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయని అన్నారు. పవన్ పోటీ చేసిన గాజువాకలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చాలా ఎక్కువగా ఉన్నారని.. వారికి అండగా నిలవాల్సిన బాధ్యత పవన్‌పై ఉందని అన్నారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి బీజేపీ పెద్దల నుంచి పవన్ స్పష్టమైన హామీ తీసుకోలేదని అన్నారు.

    "సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు. ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోకుండా వ్యవహరిస్తే నాబోటోళ్లు మీతో కలిసి పనిచేయటం కష్టమని తేల్చిచెప్పారు. జనసేన ఓ రాజకీయ పార్టీగా పని చేయడం లేదు. పార్టీలో ఒక్కరికి మినహా ఇతర వ్యక్తులకు విలువ లేకుండా చేయడం సమంజసం కాదు. అందుకే నేను పార్టీకి రాజీనామా చేస్తున్నా" అని మదాసు గంగాధరం పేర్కొన్నారు. ఇక, తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోయినప్పటికీ.. మిత్రపక్షం బీజేపీ తరఫున పవన్ ప్రచారం నిర్వహించారు. అయితే ఈ పరిస్థితుల్లో గంగాధరం రాజీనామాతో పార్టీకి కొంతమేర షాక్ తగిలిందనే చెప్పాలి.

    ఇక, మాదాసు గంగాధరం రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత చాలాకాలం కాంగ్రెస్ పార్టీలోనే ఆయన కొనసాగారు. ఏపీసీసీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అయితే 2018లో ఆయన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. మాదాసు గంగాధరం జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ కన్వీనర్‌గా పనిచేశారు. ప్రస్తుతం జనసేన ఎలక్షన్ స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. అయితే తాజాగా జనసేనకు రాజీనామా చేశారు. అయితే తన రాజకీయ భవిష్యత్తుపై గంగాధరం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: AP Politics, Janasena, Tirupati Loksabha by-poll

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు