గుంటూరు జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత... వైసీపీ మహిళ నేతను అడ్డుకున్న జనసేన

ఐదేళ్ల వయసున్న అభంశుభం తెలియని పాపపై జరిగిన అత్యాచారాన్ని టీడీపీ, జనసేన, సిపిఐ, సిపిఎం నేతలు ఖండించారు.

news18-telugu
Updated: December 14, 2019, 12:37 PM IST
గుంటూరు జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత... వైసీపీ మహిళ నేతను అడ్డుకున్న జనసేన
వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ
  • Share this:
దిశ చట్టం చేసిన 24 గంటల్లోపే... గుంటూరులో చిన్నారిపై అత్యాచారం కలకం రేపుతోంది. ఈ ఘటనపై గుంటూరు జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఐదేళ్ల వయసున్న అభంశుభం తెలియని పాపపై జరిగిన అత్యాచారాన్ని టీడీపీ, జనసేన, సిపిఐ, సిపిఎం నేతలు ఖండించారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాలికకు అండగా ఆయా పార్టీల నేతలు ఆస్పత్రి కాన్పుల వార్డు ఎదుట ధర్నాకు దిగారు. హోం మంత్రి తక్షణమే రావాలని, బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దిశా చట్టంలో గుంటూరు ఘటన తొలి చర్యగా చేపట్టాలన్నారు.ఈ సందర్భంగా ఆస్పత్రి వద్దకు వచ్చిన ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్, వైసీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మను జనసేన, వామపక్ష నేతలు అడ్డుకున్నారు. వెంటనే నిందితుల్ని కఠినంగా శిక్షించి... బాధిత కుటుంబానికి సత్వర న్యాయం అందించాలని డిమాండ్ చేశారు. దీంతో కాసేపు గుంటూరు జీజీహెచ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

గుంటూరులోని రామిరెడ్డి నగర్‌లో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఇంట్లో ఆడుకుంటున్న పాపపై లక్ష్మణ్ రెడ్డి అనే యువకుడు అత్యాచారం చేశాడు.

పాప తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. లక్ష్మణ్ రెడ్డి అనే యువకుడు గుంటూరులో ఇంటర్ చదువుతున్నాడు. బాలిక ఇంట్లోనే పై పోర్షన్‌లో అతడు నివసిస్తున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారం చేశాడు. ఐతే పాప అనారోగ్యంగా ఉండడంతో తల్లిదండ్రులకు అనుమానమచ్చింది. ఏం జరిగిందని ఆరా తీయడంతో ఈ దారుణం బయటపడింది. ఘటనపై నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో పాప తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. నిందితుడు లక్ష్మణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి గుంటూరు జీజీహెచ్‌‌లో చికిత్స పొందుతుంది.

First published: December 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>