ఏపీలోని వైసీపీ ప్రభుత్వం వంద రోజుల పాలనపై అన్ని అధ్యయనం చేసేందుకు పార్టీ నేతలు, నిపుణులతో కొద్దిరోజుల క్రితం కమిటీ వేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తాజాగా దీనిపై పవన్ కళ్యాణ్‌కు నివేదిక అందింది. ఈ నివేదికను ఈ నెల 14న విడుదల చేసేందుకు జనసేన సిద్ధమైంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నివేదికను విడుదల చేయనున్నారు. కొత్త ప్రభుత్వం పరిపాలన, తీరుతెన్నులపై వంద రోజుల పాటు ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దని నిర్ణయించుకున్న జనసేన... సీఎం జగన్ పాలనకు వంద రోజులు పూర్తి కావడంతో నివేదిక విడుదల చేసేందుకు సిద్ధమైంది.
పార్టీ నేతలు, నిపుణులు ఇచ్చిన నివేదికల్లోని మఖ్యాంఖాలను క్రోడీకరించి జనసేన ఓ నివేదికను సిద్ధం చేయనుంది. దీనినే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 14న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 13 నుంచి మూడు రోజుల పాటు విజయవాడలోనే ఉండనున్న పవన్ కళ్యాణ్... వివిధ వర్గాల వారిని కలుసుకుంటారని పార్టీ ప్రకటించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm ys jagan mohan reddy, Janasena, Mangalagiri, Pawan kalyan, Ysrcp