Home /News /politics /

JANASENA PRESIDENT PAWAN KALYAN SHOCK TO BJP IN TELANGANA DURING MLC ELECTIONS AK

Pawan Kalyan: ఎమ్మెల్సీ ఎన్నికల వేళ.. బీజేపీకి షాకిచ్చిన పవన్ కళ్యాణ్...

పవన్ కళ్యాణ్( ఫైల్ ఫోటో)

పవన్ కళ్యాణ్( ఫైల్ ఫోటో)

Pawan Kalyan: ఏపీలో జనసేన, బీజేపీ మధ్య స్నేహం బాగానే ఉన్నా.. తెలంగాణలో మాత్రం రెండు పార్టీల మధ్య సఖ్యత లేదనే విషయాన్ని పవన్ కళ్యాణ్ పరోక్షంగా వెల్లడించారు.

    ఏపీలో బీజేపీతో కలిసి రాజకీయ ప్రయాణం సాగిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తెలంగాణలో మాత్రం ఆ పార్టీతో విభేదించారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి జనసేన మద్దతు ప్రకటించింది. దీనిపై బీజేపీ స్పందించలేదు. అయితే తాజాగా ఈ అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఏపీలో జనసేన, బీజేపీ మధ్య స్నేహం బాగానే ఉన్నా.. తెలంగాణలో మాత్రం రెండు పార్టీల మధ్య సఖ్యత లేదనే విషయాన్ని పవన్ కళ్యాణ్ పరోక్షంగా వెల్లడించారు. ఇక్కడ జనసేన పార్టీకి బీజేపీ గౌరవం ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. తమకు గౌరవం లభించని చోటు తాము మాత్రం ఎదుటి వారికి గౌరవం ఎలా ఇస్తామని.. ఈ కారణంగానే జనసేన తెలంగాణ శ్రేణులు టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి మద్దతు ఇస్తామంటే ఒప్పుకున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.

    ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న రోజే.. పవన్ కళ్యాణ్ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు తెలంగాణలో భవిష్యత్తులో జనసేన పోటీ చేసే విషయంపై కూడా పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే జరగాల్సి ఉన్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన శ్రేణులకు పిలుపునిచ్చారు. గెలుపు ఓటముల అంశాన్ని పక్కనపెట్టి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన నేతలకు సూచించారు. ఈ రకంగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో జనసేన ఒంటరిగా బరిలోకి దిగుతుందని జనసేన బీజేపీకి సంకేతాలు ఇచ్చింది. దీంతో తమకు ప్రాధాన్యత ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఒంటరి పోరుకు దిగుతామని జనసేన బీజేపీకి హెచ్చరికలు జారీ చేసినట్టు కనిపిస్తోందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Bjp, Janasena, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు