ఏపీలోని రాజకీయ పార్టీలకు పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్

కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని, దేశాన్ని వదిలిపెట్టిపోయేంత వరకూ రాజకీయాలను పక్కన పెడదామని పవన్ కళ్యాణ్ సూచించారు.

news18-telugu
Updated: April 22, 2020, 12:26 PM IST
ఏపీలోని రాజకీయ పార్టీలకు పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్
పవన్ కళ్యాణ్
  • Share this:
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో రాజకీయాలు వద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఆపత్కాల సమయంలో జనసేన పార్టీ అందరినీ ఇదే కోరుకుంటోందని ఆయన తెలిపారు. కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని దేశాన్ని వదిలిపెట్టిపోయేంత వరకూ రాజకీయాలను పక్కన పెడదామని ఆయన అందరికీ సూచించారు. ఈ సమయంలో చిల్లర రాజకీయాలకు దూరంగా ఉందామని కోరారు. ప్రజలను రక్షించుకోవడం, వారి సంక్షేమం, అవసరాలు, ఆకలిదప్పులు తీర్చడంపై శక్తియుక్తుల్ని కేంద్రీకరిద్దామని పవన్ కళ్యాణ్ తెలిపారు.

ఏపీలో తప్పులు వేలెత్తి చూపేవారిపై బురద చల్లే కార్యక్రమాన్ని అధికార పార్టీ పెద్దలు కొనసాగిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణపై వ్యక్తిగత విమర్శలు ఇందులో భాగంగానే కనిపిస్తున్నాయని అన్నారు. ఇప్పటివరకు అయినది చాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమయంలో రాజకీయాలు ఆపకపోతే ప్రజలు తిరగబడే పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.

First published: April 22, 2020, 12:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading