• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • JANASENA PRESIDENT PAWAN KALYAN KEY DECISION ON PARTY COMMITTEES AK

పవన్ కళ్యాణ్ సరికొత్త వ్యూహం... వారికి షాక్ ?

పవన్ కళ్యాణ్ సరికొత్త వ్యూహం... వారికి షాక్ ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కమిటీల ఏర్పాటు విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

  • Share this:
    పార్టీ కోసం పూర్తిస్థాయిలో సమయం కేటాయిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్... పార్టీ నిర్మాణంపై ఫోకస్ చేశారు. పార్టీని బలోపేతం చేయాలంటే ముందుగా కిందిస్థాయి నుంచి కమిటీలు వేయాలని పలువురు సీనియర్లు పవన్ కళ్యాణ్‌కు సూచించడంతో... ఆ దిశగా జనసేనాని దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కమిటీల ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం తీసుకునే నాయకులకు పలు కీలక సూచనలు చేసిన పవన్ కళ్యాణ్... కమిటీల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత దక్కేలా జాగ్రత్తలు తీసుకోవాలని క్లారిటీ ఇచ్చారు.

    అయితే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక అసలు కారణం వేరే ఉందని జనసేనలో చర్చ జరుగుతోంది. జనసేన పార్టీల్లోకి కమిటీల్లో కాపులకే అధిక ప్రాధాన్యత దక్కుతుందనే వాదనకు చెక్ చెప్పేందుకే పవన్ కళ్యాణ్ ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. కమిటీల్లో ఎక్కువగా కాపులకే ప్రయారిటీ ఇస్తే... ఆ తరువాత జనసేన కాపుల పార్టీ అనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతోనే పవన్ కళ్యాణ్ ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారని రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

    మొదటి నుంచి తన పార్టీపై కుల ముద్ర పడొద్దనే భావనలో ఉన్న పవన్ కళ్యాణ్... కమిటీల ఏర్పాటు విషయంలోనూ అదే పద్ధతిని పాటిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేయడం వల్ల తనపై కాపు ముద్ర పడిందనే భావనలో ఉన్న పవన్ కళ్యాణ్... ఈ ముద్రను తొలగించుకునేందుకే ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం కూడా మొదలైంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ తాజా నిర్ణయంతో... జనసేన కమిటీల్లో కాపు సామాజికవర్గానికి పరిమితంగానే ప్రాతినిథ్యం దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.




    First published: