తాను వైసీపీ నేతలను రాష్ట్ర సమస్యల గురించి ప్రశ్నిస్తుంటే.. వాళ్లు తనను వ్యక్తిగతంగా నిందిస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. మంగళగిరిలో జరిగిన జనసేన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ గ్రామసింహాలు అంటూ ప్రసంగం ప్రారంభించిన పవన్ కళ్యాణ్.. వారిని వీధి కుక్కలు, పిచ్చికుక్కలతో పోల్చారు. వైసీపీ నేతలకు అన్నీ ఉన్నాయని.. కానీ భయం మాత్రం లేదని వ్యాఖ్యనించారు. వారికి భయం అంటే ఏంటో చూపిస్తానని అన్నారు. తన వ్యక్తిగత జీవితం బ్లాక్ అండ్ వైట్ అని.. వైసీపీ వారి జీవితాలు రంగులమయమని అన్నారు. తనపై బూతుపురాణం మొదలుపెట్టారని.. బాపట్లలో పుట్టిన తనకు బూతులు రావా ? అని ప్రశ్నించారు. కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి కొడతానని హెచ్చరించారు. అయితే తాను ఎప్పుడూ సంస్కారం మరిచి మాట్లాడబోనని అన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టే బూతులు మాట్లాడటం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఏపీలో అభివృద్ధి ఎక్కడుందని.. ఈ అంశం గురించి మాట్లాడే హక్కు తనకు ఉందని అన్నారు. జగన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేసారమ్మా అంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లు చేసుకున్నాడు అని వైసిపి నేతలు అంటున్నారని విమర్శించారు. ప్రతి సన్నాసితో తిట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదని.. తనను ప్రేమించే లక్షలాది మంది కోసమే తాను ఇవన్నీ పడుతున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. తనను తిడితే బలహీనపడతానని అనుకుంటున్నారని.. కానీ తనను తిడితే మరింత బలపడతానని తెలిపారు. తాను తగ్గి మాట్లాడుతున్నానని అన్నారు. యుద్ధం మొదలుపెడితే తాను వెనకాడబోనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
Telangana Congress: హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు ?.. స్పందించిన సీనియర్ నేత.. ఆ తరువాతే ప్రకటన
Remove Spiders From Home: ఇంట్లో సాలీడు సమస్య ఉందా ? ఇలా చేయండి.. వెంటనే బయటకు వెళ్లిపోతాయి..
ప్రజలందరికీ ప్రభుత్వం సొమ్మును సమానంగా ఇవ్వాలని.. తనకు ఓటు వేసిన వాళ్లకే పథకాలు, డబ్బులు ఇస్తామంటే చూస్తూ ఊరుకోవాలా ? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఎక్కువ చేయొద్దని.. గీత దాటితే తోలు తీస్తానని హెచ్చరించారు. సినిమా టికెట్లపై తాను ప్రశ్నిస్తే గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. ఏపీలో తనకేమైనా సినిమా ధియేటర్లు ఉన్నాయా ? అని ప్రశ్నించారు. దౌర్జన్యం చేసిన వాళ్లు ఎవరైనా తమ శత్రువులే అని పవన్ కళ్యాణ్ అన్నారు.
వైసీపీకి అధికారం ఇచ్చి తనను పోరాటం చేయాలని ప్రజలు కోరుతున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఓటు వారికి వేసి తనను పోరాటం చేయమంటే ఎలా అని ప్రశ్నించారు. అయితే తాను ఈ విషయంలో వెనక్కి తగ్గబోనని అన్నారు. కనీసం విశాఖలో తనను గెలిపించి ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై పోరాటం చేసి ఉండేవాడినని తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాలు మారబోతున్నాయని.. ప్రభుత్వ శాఖలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన వైసీపీ.. వచ్చే ఎన్నికల్లో 15 సీట్లుకు పరిమితం కాదని ఊహించగలమా ? అని పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pawan kalyan