• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • JANASENA PRESIDENT PAWAN KALYAN CHANGES HIS OPINION ON KAPU RESERVATION ISSUE AK

కాపు రిజర్వేషన్లపై పవన్ కళ్యాణ్ రూటు మారుస్తున్నారా ?

కాపు రిజర్వేషన్లపై పవన్ కళ్యాణ్ రూటు మారుస్తున్నారా ?

పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)

కాపు రిజర్వేషన్ల అంశంపై పవన్ కళ్యాణ్ స్పందించడం ఆసక్తిరేపుతోంది. జనసేన పార్టీ ఏర్పాటు తరువాత అనేక అంశాలపై తన వైఖరిని స్పష్టంగా చెప్పిన వపన్ కళ్యాణ్... కాపు రిజర్వేషన్ల అంశానికి మాత్రం బహిరంగంగా మద్దతు తెలపలేకపోయారు.

  • Share this:
    ఎన్నికల్లో ఓటమి తరువాత కొంతకాలం సెలెంట్‌గా ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్... మళ్లీ దూకుడు పెంచారు. కొన్ని వారాల పాటు పార్టీ నేతలతో సమీక్షలు చేపట్టిన పవన్ కళ్యాణ్... ఇప్పుడు మళ్లీ నియోజకవర్గాల పర్యటనకు రెడీ అయిపోయారు. ఈ క్రమంలోనే తాను ఓడిన భీమవరం నియోజకవర్గంలో పర్యటించారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన పలు వ్యాఖ్యలపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా కాపు రిజర్వేషన్ల అంశంపై పవన్ కళ్యాణ్ స్పందించడం ఆసక్తిరేపుతోంది. జనసేన పార్టీ ఏర్పాటు తరువాత అనేక అంశాలపై తన వైఖరిని స్పష్టంగా చెప్పిన వపన్ కళ్యాణ్... కాపు రిజర్వేషన్ల అంశానికి మాత్రం బహిరంగంగా మద్దతు తెలపలేకపోయారు. అలా చేస్తే తన పార్టీకి కాపు పార్టీ అనే ముద్ర పడుతుందని... అప్పుడు ప్రజారాజ్యం తరహాలోనే తన పార్టీని కూడా ప్రత్యర్థులు టార్గెట్ చేసే అవకాశం ఉంటుందని పవన్ కళ్యాణ్ భావించినట్టు సమాచారం.

    అయితే కాపు రిజర్వేషన్ల అంశంపై పూర్తిస్థాయిలో స్పష్టత ఇవ్వకపోవడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాపులు జనసేన వైపు మొగ్గు చూపలేదని కొందరు నేతలు పవన్ కళ్యాణ్‌కు సూచించినట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే ఆయన కాపు రిజర్వేషన్ల విషయంలో తన వైఖరి మార్చుకోవడానికి నిర్ణయించుకున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా కాపుల రిజర్వేషన్ అంశంపై స్పందించారనే చర్చ జరుగుతోంది.

    సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజకీయ కోణంలో చూడడం సరికాదన్న పవన్... జమ్మూకశ్మీర్ వంటి క్లిష్లమైన సమస్యలకే పరిష్కారాలు కనుగొంటున్నప్పుడు, ఏపీలో కాపుల రిజర్వేషన్ ఏమంత కష్టం కాదని అభిప్రాయపడ్డారు. జమ్మూకశ్మీర్‌తో పోలిస్తే కాపుల రిజర్వేషన్ చాలా సులభం అని తెలిపారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను బట్టి... భవిష్యత్తుల్లో కాపు రిజర్వేషన్ల కోసం జరిగే పోరాటాలకు జనసేన మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
    First published: