డ్రోన్ రాజకీయాలొద్దు... టీడీపీ, వైసీపీలపై పవన్ కళ్యాణ్ ఫైర్

మాజీ ముఖ్యమంత్రి ఇంటిని ముంచేస్తారా అని ప్రతిపక్షం, మునిగిందా లేదా అని చూసేందుకు అధికార పక్షంవాళ్లు వెళ్లి రాజకీయాలు చేస్తూ బాధల్లో ఉన్న ప్రజలను వరద నీటికి వదిలేశారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.

news18-telugu
Updated: August 17, 2019, 7:19 PM IST
డ్రోన్ రాజకీయాలొద్దు... టీడీపీ, వైసీపీలపై పవన్ కళ్యాణ్ ఫైర్
పవన్, జగన్, చంద్రబాబు
  • Share this:
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసాన్ని వరద చుట్టుముట్టడం, ఆయన ఇంటిపై డ్రోన్లు సంచరించడంపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం సాగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. కృష్ణా నది వరదకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి ప్రజలు అగచాట్లుపడుతుంటే... వారికి సహాయం చేయకుండా మంత్రులు, ప్రజా ప్రతినిధులు కరకట్ట చుట్టూ తిరగడం శోచనీయమని పవన్ వ్యాఖ్యానించారు. వరద ఉధృతి ఉన్నప్పుడు లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడటం ప్రభుత్వం బాధ్యత అని పవన్ కళ్యా గుర్తు చేశారు.

కరకట్ట మీద ఉన్న నిర్మాణాలు మునిగిపోతాయా లేదా అంటూ డ్రోన్లు ఎగరేసి చూడటమా మంత్రుల బాధ్యత అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కరకట్ట మీద ఉన్న మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి ఆశ్రమం, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు నివాసం, చంద్రబాబు ఇల్లుతో పాటు ప్రముఖుల ఇళ్లు, ఆశ్రమాలు ఉన్నాయని... వరద ఉధృతి పెరిగితే అన్నీ మునుగుతాయని పవన్ అన్నారు. ఇందుకోసం డ్రోన్ రాజకీయాలు అక్కర్లేదని అన్నారు. ముందుగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను కాపాడి, వారికి కావల్సిన అన్ని రకాల సహాయాలు చేయండని పవన్ సూచించారు.

మాజీ ముఖ్యమంత్రి ఇంటిని ముంచేస్తారా అని ప్రతిపక్షం, మునిగిందా లేదా అని చూసేందుకు అధికార పక్షంవాళ్లు వెళ్లి రాజకీయాలు చేస్తూ బాధల్లో ఉన్న ప్రజలను వరద నీటికి వదిలేశారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. రాజకీయాలు, కక్ష సాధింపులు ఏవైనా ఉంటే తరువాత చేసుకోండని టీడీపీ, వైసీపీ నేతలకు సూచించారు. 151 సీట్లు వచ్చిన అధికార పార్టీ ప్రజల పట్ల బాధ్యతతో సుపరిపాలన అందించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. రాజకీయాలు కొద్ది రోజులు పక్కనపెట్టి ముంపు బాధిత ప్రాంత ప్రజలకు, రైతులకు సహాయం చేయాలని కోరారు.First published: August 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు