సీఎం జగన్‌కు పవన్ కళ్యాణ్ లేఖ... ఏమన్నారంటే...

పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్

కొత్తగా ప్రభుత్వం దృష్టికి వంద రోజుల పాటు ప్రజా డిమాండ్లు తీసుకురావొద్దని భావించామని... అయితే తప్పనిసరి పరిస్థితుల్లో లేఖ రాయాల్సి వస్తోందని సీఎం జగన్‌కు రాసిన లేఖలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

  • Share this:
    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం సెప్టెంబర్ 5న ఇసుకపై ప్రభుత్వ పాలసీ ప్రకటిస్తామని చెప్పిందని... అయితే అప్పటివరకు వారికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని విజ్ఞప్తి చేశారు. వారి భృతికి భరోసా కల్పించవలసిన అవసరం ఉందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక మైనింగ్ అవకతవకలపై తాను కూడా మాట్లాడానని పేర్కొన్నారు. కొత్త ఇసుక పాలసీలో ఎటువంటి అవకతవకలు ఉండరాదని జనసేన కోరుతుందని అన్నారు. ఇసుక పాలసీ రావడానికి మరికొంత సమయం ఉన్నందున తక్షణం భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని సూచించారు. కొత్తగా ప్రభుత్వం దృష్టికి వంద రోజుల పాటు ప్రజా డిమాండ్లు తీసుకురావొద్దని భావించామని... అయితే తప్పనిసరి పరిస్థితుల్లో భవన నిర్మాణ కార్మికుల కోసం లేఖ రాస్తున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖలో వివరించారు.
    First published: