జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పిఎసి) నేడు అత్యవసర సమావేశం నిర్వహించనుంది. నేటి సాయంత్రం పార్టీ పీఏసీ భేటీ నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నేటి సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం ప్రారంభంకానుంది. అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభం అవుతుండగా రాజధాని అమరావతి పై పార్టీ పరంగా తీసుకోవలసిన నిర్ణయాలు, బీజేపీతో పొత్తు తరువాత కలసి పనిచేయడం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఏపీలో జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రయోజనాల కోసమే రెండు పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు ఆ పార్టీల నేతలు తెలిపారు. స్థానిక ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు అన్ని చోట్లా కలిసి పనిచేస్తామని చెప్పారు. బలమైన, సుస్థిరమైన పాలన, అవినీతి రహిత పాలనను అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. 2024లో ఏపీలో జనసేన-బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.