ఆ రెండు రోజులు... భవన నిర్మాణ కార్మికులకు జనసేన ఆధ్వర్యంలో ఆహార శిబిరాలు...

ఇసుక కొరత వల్ల ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికుల కోసం ఈనెల 15, 16 తేదీల్లో ఆహార శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు.

news18-telugu
Updated: November 8, 2019, 9:11 PM IST
ఆ రెండు రోజులు... భవన నిర్మాణ కార్మికులకు జనసేన ఆధ్వర్యంలో ఆహార శిబిరాలు...
పవన్ కళ్యాణ్ (File)
  • Share this:
రాష్ట్రంలో ఇసుక కొరత వల్ల ఉపాధి కోల్పోయి పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొందని జనసేన పార్టీ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో వారిలో కొంత ఊరట కల్పించేందుకు డొక్కా సీతమ్మ పేరుతో ఆహార శిబిరాలు ఏర్పాటు చేయాలని జనసేన నిర్ణయించింది. ఈనెల 15, 16 తేదీల్లో ఆహార శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. ‘పనుల కోసం అడ్డాకు కార్మికులు వచ్చే సమయంలో - అడ్డాల దగ్గరే శిబిరాలు ఏర్పాటు చేసి ఆహారాన్ని అందిస్తాం.. మా వనరులు పరిమితమేగావచ్చు. కానీ మనకు చేతనైనంత సాయం చేస్తాం.’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ శిబిరాలు చూసైనా ప్రభుత్వం కార్మికులకు ఉచితంగా ఆహారాన్ని అందించే ఏర్పాట్లు చేయాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ క్యాంటీన్లు ద్వారా అందిస్తారో మరో విధంగానో... కార్మికులకు, వారి కుటుంబాలకు ఉచితంగా ఆహారం అందించాలని కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే శిబిరాలకు ఏ రంగైనా వేసుకోండి.. ఏ పేరైన పెట్టుకోండి. కానీ కార్మికులకు ఉచితంగా ఆహారాన్ని అందించాలన్నారు.

‘రాజశేఖర్ రెడ్డి మరణం తరవాత 1200 మంది చనిపోయారని ఏ లెక్కలతో చెప్పారో తెలియదుగానీ ఓదార్పు యాత్రలో వారి ఇళ్లకు వెళ్లి లక్షల రూపాయలు ఇచ్చారు. మీ నిర్ణయంతో ఉపాధి లేక 50 మంది వరకూ చనిపోయారని భవన నిర్మాణ కార్మిక సంఘాలే చెబుతున్నాయి. మరి ఏ లెక్కలతో ఏడు కుటుంబాలకే పరిహారం ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు?’ అని జనసేన ఓ ప్రకటనలో ప్రశ్నించింది.
First published: November 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading