సత్వర న్యాయం లభించింది.. షాద్‌నగర్ ఎన్‌కౌంటర్‌పై పవన్

ఆడపడుచుల శ్రేయస్సు దృష్ట్యా నేర స్థాయినిబట్టి మరణ శిక్ష అయినా, మరే ఇతర శిక్ష అయినా సరే, బహిరంగంగా అమలు జరపాలన్నారు పవన్.

news18-telugu
Updated: December 6, 2019, 12:00 PM IST
సత్వర న్యాయం లభించింది.. షాద్‌నగర్ ఎన్‌కౌంటర్‌పై పవన్
పవన్ కళ్యాణ్
  • Share this:
షాద్‌నగర్ ఎన్‌కౌంటర్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రజలు కోరుకున్న విధంగా దిశ ఉదంతంలో సత్వర న్యాయం లభించిందన్న ఆయన.. దిశ ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఈ విషాదం నుంచి ఆమె తల్లిదండ్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇలాంటి కేసుల్లో కోర్టుల పరంగా తక్షణ న్యాయం లభించాలని.. రెండు మూడు వారాలలోనే శిక్షలు పడేలా నిబంధనలు రావాలని అభిప్రాయపడ్డారు. ఆడపడుచుల శ్రేయస్సు దృష్ట్యా నేర స్థాయినిబట్టి మరణ శిక్ష అయినా, మరే ఇతర శిక్ష అయినా సరే, బహిరంగంగా అమలు జరపాలన్నారు పవన్.

''దిశ ఉదంతం మన ఆడపడుచుల రక్షణకు ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోవని హెచ్చరిస్తోంది. ఆ కరాళ రాత్రి వేళ నలుగురు ముష్కరుల మధ్య దిశ ఎంత నరకాన్ని చూసిందో తలచుకుంటేనే ఆవేశం, ఆక్రోశం, ఆవేదనతో శరీరం ఉడికిపోతోంది. జాతి యావత్తు తక్షణ న్యాయం కోరుకోవడానికి కారణం ఈ ఆవేదనే. దిశ సంఘటన ముగిసిందని దీనిని మనం ఇంతటితో వదిలిపెట్టకూడదు. మరే ఆడబిడ్డకు ఇటువంటి పరిస్థితి రాకూడదు. నిర్భయ ఉదంతం తరువాత బలమైన చట్టాన్ని మన పార్లమెంటు తీసుకొచ్చింది. అయినా అత్యాచారాలు ఆగలేదు. అంటే ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని జరుగుతున్న సంఘటనలు తెలుపుతున్నాయి. ఆడపిల్లల వైపు వక్రబుద్ధితో చూడాలంటేనే భయపడే విధంగా కఠినాతి కఠినమైన చట్టాలు రావలసిన అవసరం ఉంది. ఇతర దేశాలలో ఎటువంటి చట్టాలు ఉన్నాయో అధ్యయనం చేయాలి.'' అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

Published by: Shiva Kumar Addula
First published: December 6, 2019, 11:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading