విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు : తెలంగాణ ప్రభుత్వానికి జనసేన లేఖ

Pawan Kalyan letter to telangana govt against inter board : పరీక్ష ఫీజు చెల్లింపు, పేపర్ వాల్యూయేషన్, ఫలితాల వెల్లడి.. ఇలా విద్యార్థుల తల్లిదండ్రుల్లో అనేక సందేహాలున్నాయని.. వాటిని నివృత్తి చేసి నిజాలను వెల్లడించాలని అన్నారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయాల్సిందిపోయి.. వారి తల్లిదండ్రుల పైనే బోర్డు అధికారులు ఎదురుదాడికి దిగడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు.

news18-telugu
Updated: April 24, 2019, 1:22 PM IST
విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు : తెలంగాణ ప్రభుత్వానికి జనసేన లేఖ
పవన్ కల్యాణ్
news18-telugu
Updated: April 24, 2019, 1:22 PM IST
తెలంగాణ ఇంటర్ బోర్డు అవకతవకల నేపథ్యంలో విద్యార్థులకు జనసేన అండగా నిలిచింది. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని తెలంగాణ ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాశారు. బోర్డు వ్యవహరించిన తీరుతో విద్యార్థుల భవిష్యత్ అగమ్య గోచరంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితాలు వెల్లడించాక 17మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని.. ప్రభుత్వమే ఇందుకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

పరీక్ష ఫీజు చెల్లింపు, పేపర్ వాల్యూయేషన్, ఫలితాల వెల్లడి.. ఇలా విద్యార్థుల తల్లిదండ్రుల్లో అనేక సందేహాలున్నాయని.. వాటిని నివృత్తి చేసి నిజాలను వెల్లడించాలని అన్నారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయాల్సిందిపోయి.. వారి తల్లిదండ్రుల పైనే బోర్డు అధికారులు ఎదురుదాడికి దిగడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు ఉచితంగా రీవాల్యుయేషన్, రీ వెరిఫికేషన్ చేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన విద్యార్థులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. జీవితం చాలా విలువైనది అని..నిరాశతో ఆత్మహత్యలకు పాల్పడవద్దని విద్యార్థులకు హితవు పలికారు.
Janasena Pawan Kalyan letter to telangana govt against inter board

(ఇంటర్ బోర్డు వైఫల్యంపై తెలంగాణ ప్రభుత్వానికి జనసేన లేఖ)

First published: April 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...