ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. లేకపోతే దీనిపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జనసేన పార్టీ లీగల్ సెల్ విభాగానికి సూచించినట్టు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. లేకపోతే దీనిపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జనసేన పార్టీ లీగల్ సెల్ విభాగానికి సూచించినట్టు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. కరోనాకు ముందు జరిగిన నామినేషన్ల ప్రక్రియలో చాలా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. తమ పార్టీ నాయకులు చాలా మందిని బెదిరించారన్నారు. దాడులకు పాల్పడి నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. గతంలో నామినేషన్ల సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొన్నవారు తమ ఫిర్యాదులు తీసుకుని జిల్లాల కలెక్టర్లను కలవాలని రాష్ట్ర ఎన్నికలసంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించిన తర్వాత తమ పార్టీకి చెందిన వారు కలెక్టర్లను కలవడానికి వెళ్తే అక్కడ అధికారులు తూతూమంత్రంగా ఫిర్యాదులు తీసుకుంటున్నారని ఆరోపించారు. జిల్లాల కలెక్టర్లు కలవడం లేదని, కిందిస్థాయి అధికారులు నామ్ కే వాస్తే కంప్లెయింట్స్ తీసుకుని పంపించేస్తున్నారని చెప్పారు. ఈ ప్రక్రియలో సీరియస్‌నెస్ లేదన్నారు.
‘మాకు ఈ ప్రక్రియపై నమ్మకం పోయింది. ఫిర్యాదులు వరకు న్యాయం చేస్తామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పినా మాకు నమ్మకం కలగడం లేదు. తాజా నోటిఫికేషన్ విడుదల చేస్తే తప్ప మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. దీనిపై మా లీగల్ సెల్ విభాగంతో మాట్లాడా. హైకోర్టులో కూడా అప్పీల్ చేయమని చెప్పా. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌పై ఎస్ఈసీ మరోసారి పునరాలోచించాలి.’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.
జెడ్జీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల నిర్వహణ ఎస్ఈసీ నిమ్మగడ్డకు అసలైన సవాలుగా నిలవనుంది. ఎన్నికల సమయంలో వైసీపీ అక్రమాలకు పాల్పడిందనడానికి ఆధారాలను స్వయంగా నిమ్మగడ్డే.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మళ్లీ ఆయనే దాన్ని కొనసాగిస్తామని చెప్పడం ప్రతిపక్షాల ఆగ్రహానికి కారణంగా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర గుర్తింపు పొందిన పార్టీలు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.