స్థానిక సంస్థల ఎన్నికలపై పవన్ కళ్యాణ్ సరికొత్త డిమాండ్...

AP Localbody Elections | ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం కాదని, మళ్లీ కొత్తగా మొదలు పెట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: March 15, 2020, 12:15 PM IST
స్థానిక సంస్థల ఎన్నికలపై పవన్ కళ్యాణ్ సరికొత్త డిమాండ్...
పవన్ కళ్యాణ్ (File)
  • Share this:
Pawan Kalyan on AP Localbody Elections | ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం కాదని, మళ్లీ కొత్తగా మొదలు పెట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో అధికార పార్టీ భారీ స్థాయిలో హింసకు, దౌర్జన్యానికి పాల్పడిందని, నామినేషన్ల ప్రక్రియ కూడా సరిగా సాగలేదని అన్నారు. భయపెట్టి, బెదిరించి ప్రత్యర్థుల నామినేషన్లను విత్ డ్రా చేయించారని, కాబట్టి మళ్లీ ఎన్నికల ప్రక్రియను నూతనంగా ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరుగుతున్న పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్... ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘నామినేషన్ల ప్రక్రియ ప్రజాస్వామ్యబద్ధంగా సాగలేదు. ఏకపక్షంగా జరిగింది. పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా మారిపోయారు. ఇవన్నీ తెలిసి కూడా ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగినట్టు ఎన్నికల సంఘం మాట్లాడడం విడ్డూరం. ఎన్నికల ప్రక్రియ వాయిదా వేయడం కాదు. మొత్తం నామినేషన్ల ప్రక్రియను కూడా రద్దు చేసి కొత్తగా చేపట్టాలి.’ అని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఒకవేళ ఎన్నికల సంఘం అలా చేయకపోతే తాము కోర్టును ఆశ్రయిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎన్నికల్లో అధికార పార్టీకి వత్తాసు పలికిన అందరు అధికారుల జాబితా సిద్ధం చేస్తున్నామని, వారు ఈరోజు తప్పించుకోవచ్చు కానీ, రేపు తప్పించుకోలేరన్నారు. వారి వివరాలన్నీ కేంద్రానికి పంపుతామని, ఎన్నికల కమిషన్‌కు కూడా లేఖలు రాస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు.
First published: March 15, 2020, 12:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading