కడప ఎంపీ, మంగళగిరి అసెంబ్లీ బరి నుంచి తప్పుకున్న జనసేన.. మిత్రపక్షానికి ఛాన్స్

పొత్తుల్లో భాగంగా కడప ఎంపీ సీటు, మంగళగిరి అసెంబ్లీ సీటును సీపీఐకి కేటాయించారు.

news18-telugu
Updated: March 17, 2019, 9:42 PM IST
కడప ఎంపీ, మంగళగిరి అసెంబ్లీ బరి నుంచి తప్పుకున్న జనసేన.. మిత్రపక్షానికి ఛాన్స్
పవన్ కళ్యాణ్, బీవీ రాఘవులు, సురవరం సుధాకర్ రెడ్డి
news18-telugu
Updated: March 17, 2019, 9:42 PM IST
రాబోయే అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో కలసి పోటీ చేయాలని జనసేన, సీపీఎం, సీపీఐ, బీఎస్పీ నిర్ణయించాయి. ఈ క్రమంలో మిత్రపక్షాలకు జనసేన పెద్ద ఎత్తున టికెట్లను కేటాయిస్తోంది. ఇప్పటికే బీఎస్పీకి మూడు ఎంపీ, 21 ఎమ్మెల్యే స్థానాలకు ఇచ్చేందుకు రెడీ అయింది. మరోవైపు సీపీఎం, సీపీఐలకు జిల్లాకు ఒకటి చొప్పున చెరో 13 సీట్లు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో తొలి విడుతగా చెరో ఏడు ఎమ్మెల్యే సీట్లు, రెండు ఎంపీ సీట్లను కేటాయించింది. కడప, అనంతపురం, కర్నూలు, తిరుపతి, చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయడం లేదు. వాటిని మిత్రపక్షాలకు కేటాయించింది. రాయలసీమలో నంద్యాల, హిందూపురం, రాజంపేట పార్లమెంట్ సీట్లలో మాత్రమే జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. పొత్తుల్లో భాగంగా కడప ఎంపీ సీటు, మంగళగిరి అసెంబ్లీ సీటును సీపీఐకి కేటాయించారు.

సిపిఎం:

అసెంబ్లీ స్థానాలు

1. కురుపాం(విజ‌య‌న‌గ‌రం జిల్లా)2. అర‌కు(విశాఖ‌ప‌ట్నం జిల్లా)

3. రంప‌చోడ‌వ‌రం(తూర్పుగోదావ‌రి జిల్లా)

4. ఉండి( ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా)

5. విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌(కృష్ణా జిల్లా)

6. సంత‌నూత‌ల‌పాడు(ప్ర‌కాశం జిల్లా)

7. క‌ర్నూలు(క‌ర్నూలు జిల్లా)

 

పార్ల‌మెంటు స్థానాలు

1. క‌ర్నూలు

2. నెల్లూరు

 

సిపిఐ:

అసెంబ్లీ స్థానాలు

1. పాల‌కొండ‌(శ్రీకాకుళం)

2. ఎస్‌.కోట‌(విజ‌య‌న‌గ‌రం జిల్లా)

3. విశాఖ వెస్ట్‌(విశాఖ‌ప‌ట్నం జిల్లా)

4. నూజివీడు(కృష్ణా జిల్లా)

5. మంగ‌ళ‌గిరి(గుంటూరు జిల్లా)

6. క‌నిగిరి(ప్ర‌కాశం జిల్లా)

7. డోన్‌(క‌ర్నూలు జిల్లా)

పార్ల‌మెంటు స్థానాలు

1. అనంత‌పురం

2. క‌డ‌ప‌

బీఎస్పీ : పార్లమెంట్ స్థానాలు

1. తిరుపతి

2. చిత్తూరు

3. బాపట్ల

బీఎస్పీకి 21 ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వాలని పొత్తుల్లో భాగంగా నిర్ణయించారు.

 
First published: March 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...