Home /News /politics /

JANASENA PARTY WILL PLAY CRUCIAL ROLE IN VIJAYAWADA MUNICIPAL CORPORATION ELECTIONS RESULTS FULL DETAILS HERE PRN

AP Municipal Elections: బెజవాడ కార్పొరేషన్లో టఫ్ ఫైట్... జనసేన కీలకం కాబోతోందా...?

జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ (ఫైల్)

జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మున్సిపల్ ఎన్నికలు (AP Municipal Elections) ముగిశాయి. ఫలితాలం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు ఒక ఎత్తు.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లు ఒక ఎత్తు అనే రేంజిలో ఉంది ఫైటింగ్. విజయవాడ కార్పొరేషన్లో అటు ఆధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య యుద్ధం నడుస్తోంది. మధ్యలో జనసేన-బీజేపీ కూడా తమ ప్రభావాన్నిచూపించాలని చూస్తున్నాయి. ఈ క్రమంలోనే అన్ని డివిజన్లలోనూ పోటీ చేశాయి. దీంతో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గెలుపు ఏ పార్టీది అనేది కచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. గెలుపుపై వైసీపీ నమ్మకంతో ఉంది. టీడీపీ అయితే తామే గెలుస్తామని.. వైసీపీకి అంత సీన్ లేదని స్పష్చం చేస్తుండగా.. జనసేన కూడా మేయర్ పీఠం తమదేనని చెప్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో లెక్క వేరు.. ఇప్పటి లెక్కవేరని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు.

    విజయవాడ నగరంలో జనసేన ప్రభావంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కృష్ణలంక, సింగ్ నగర్, పటమటతో పాటు విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలోని డివిజన్లలో జనసేనకు ఓట్లు బాగానే పోలైనట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో జనసేన మొత్తం 40 డివిజన్లలో పోటీ చేసింది. బీజేపీ 22 డివిజన్లలో బరిలో దిగగా.. ఒక డివిజన్లో టీడీపీ.. జనసేనకు మద్దతిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో జనసేనకు ఓట్లు బాగానే వచ్చాయి. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ప్రభావం తాము చూపిస్తామని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.

    ఇది చదవండి: మాజీ మంత్రికి బెయిల్.. పోలీసులకు షాకిచ్చిన జడ్జి



    జనసేన గెలిచే డివిజన్లపై పెద్దగా అంచనాలు లేకపోయినా.. విజేతను నిర్ణయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు టీడీపీకి బదులు జనసేన ఖాతాలో.. అలాగే టీడీపీని వ్యతిరేకించే ఓట్లు కూడా ఆ పార్టీకే పడినట్లు చర్చ జరుగుతోంది. నగర వ్యాప్తంగా కనీసం 10 డివిజన్లు గెలుచుకుంటామని జనసేన నేతలు ధీమా వ్యక్తం చేస్తుండగా.. ఐదు డివిజన్లలో తమ ప్రభావం ఉంటుందని బీజేపీ చెప్తోంది. జనసేన చీల్చే ఓట్లపైనే వైసీపీ, టీడీపీ విజయావకాశాలు ఆధారపడునట్లు విశ్లేషకులు చెప్తున్నారు.

    ఇది చదవండి: ఏపీలో వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్... 2లక్షల మందికి క్యాష్ ప్రైజ్



    2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయావకాశాలను జనసేన బాగా దెబ్బకొట్టింది. దాదాపు 40 నియోజకవర్గాల్లో జనసేన వల్ల వైసీపీకి ప్లస్ అయింది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. 2019 సీన్ రిపీట్ అయితే మాత్రం టీడీపీకి ఇక్కడ భారీ నష్టం తప్పదని భావిస్తున్నారు. ఎందుకంటే రాజధాని తరలింపు దృష్ట్యా వైసీపీ, టీడీపీలు విజయవాడను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మూడు రాజధానులకు ఇది రిఫరెండంగా కూడా భావిస్తున్నాయి. దీంతో ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏది ఏమైనా ఇక్కడి గెలుపోటముల్లో జనసేన ప్రభావం కచ్చితంగా ఉంటుందనే చర్చ మాత్రం బెంజి సర్కిల్లో జోరుగా నడుస్తోంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap local body elections, Bjp-janasena, Janasena

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు