ఆ విషయంలో చంద్రబాబే జగన్‌కు ఆదర్శం... జనసేన ట్వీట్

గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు తన కుటుంబసభ్యులతో కలిసి హోటల్‌లో డిన్నర్ చేసిన ఫోటోల్ని షేర్ చేసింది జనసేన.

news18-telugu
Updated: October 21, 2019, 2:38 PM IST
ఆ విషయంలో చంద్రబాబే జగన్‌కు ఆదర్శం... జనసేన ట్వీట్
సీఎం జగన్, చంద్రబాబునాయుడు
news18-telugu
Updated: October 21, 2019, 2:38 PM IST
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ సెటైర్లు వేసింది. ప్రజా సొమ్మను స్వాహా చేస్తున్నారని ఆరోపించింది. గత ప్రభుత్వంలో చంద్రబాబు...తన కుటుంబ విలాసాల కోసం వేలకోట్ల ప్రజాధనాన్ని స్వాహా చేస్తే... ప్రస్తుత ప్రభుత్వంలో సీఎంగా ఉన్న జగన్ తన వ్యక్తిగత కేసులకు హాజరవ్వడం కోసం... నెలకు రెండు కోట్లు స్వాహా చేస్తున్నారని విమర్శించింది. దీనిపై సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. జగన్ ప్రతి కోర్టు వాయిదాకు రూ.60లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని జనసేన పార్టీ విమర్శించింది. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు తన కుటుంబసభ్యులతో కలిసి హోటల్‌లో డిన్నర్ చేసిన ఫోటోల్ని షేర్ చేసింది జనసేన. అందులో చంద్రబాబు ఫ్యామిలీలో ఒక్కొక్కరి డిన్నర్ బిల్ లక్ష రూపాయలు అని తెలిపింది. ప్రజల కష్టాల్ని దోచుకోవడంలో చంద్రబాబునే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ఆదర్శంగా తీసుకున్నారంటూ చురకలు అంటించింది పవన్ కల్యాణ్ పార్టీ.

జనసేన ట్వీట్ చేసిన ఫోటో




First published: October 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...