తెలంగాణపై జనసేన ఫోకస్..ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ

తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 538 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి.

news18-telugu
Updated: April 20, 2019, 8:56 PM IST
తెలంగాణపై జనసేన ఫోకస్..ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ
పవన్ కల్యాణ్
news18-telugu
Updated: April 20, 2019, 8:56 PM IST
తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసేందుకు జనసేన సిద్ధమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పవన్ కల్యాణ్‌కు విజ్ఞప్తిచేశారు. తెలంగాణ జనసేన నేతలు ఇప్పటికే పవన్ కల్యాణ్‌తో సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అంశంపై చర్చించారు. ఐతే కార్యకర్తలు, అభిమానుల అభిప్రాయం తీసుకోవాలని పవన్ సూచిచండంతో ఆ పార్టీ నేతలు శనివారం సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోవాలని ఆదేశించారు. లోక్ సభ ఎన్నికల్లో ఏడు స్థానాల్లో పోటీ చేశాం. స్థానిక ఎన్నికల్లో పోటీ ఇందుకు భిన్నంగా ఉంటుంది. మన పార్టీకి యువత, మహిళలు బలం.
ఎన్.శంకర్ గౌడ్, జనసేన చీఫ్

జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కల్యాణ్ ఆలోచనా విధానం తెలంగాణ అభివృద్ధికిఎ ఎంతో అవసరం. వాటిని గ్రామస్థాయిలో అమలు చేసేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయాలి. ఇందుకు అనుగుణంగా పార్టీ అధ్యక్షుడు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ముందుకు వెళ్తాం.
జనసేన కార్యకర్తలు


తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. మూడు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 538 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి.
First published: April 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...