పవన్‌కు రాయలసీమపై ఆశలేనట్టే.. అక్కడ ద్విముఖ పోరే

చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్, జగన్ మోహన్ రెడ్డి

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నిత్యం కొనసాగుతున్న నేతల కప్పదాట్లతో రాష్ట్రంలో రాజకీయం రసకందాయంలో పడింది. ఓవైపు అధికార టీడీపీ మరోవైపు జనసేన, ఇంకోవైపు వైఎస్ఆర్‌సీపీ.. అసలు పోరు ఎవరి మధ్య ఉండనుందనే విషయంలో సందిగ్ధత నెలకొంది.

 • Share this:
  రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ చతుర్ముఖ పోటీకి వేదిక కాబోతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎవరికివారు ఒంటిగానే పోటీ చేస్తామని ప్రకటించడంతో.. పోరు రసవత్తరంగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, రాష్ట్రంలో ప్రస్తుతం బలంగా కనిపిస్తున్న పార్టీలు టీడీపీ, వైసీపీ, జనసేనలు మాత్రమే. కాంగ్రెస్, బీజేపీలు ఉన్నా అంతగా ప్రభావం చూపుతాయని చెప్పలేం. ఈ లెక్కన ప్రధానంగా  మూడు ప్రాంతీయ పార్టీల మధ్యే పోటీ నెలకొనే అవకాశం ఉంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఈ మూడు పార్టీల మధ్యే పోరు ఉంటుందని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే, రాయలసీమలో జనసేన ప్రభావం ఏమాత్రం ఉండకపోవచ్చని తెలుస్తోంది.

  janasena chief pawan kalyan, ap politics, ap political updates, rayalaseema, janasena in rayalaseema, ap cm chandrababu naidu, ysrcp jagan, ys jagan, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ఏపీ రాజకీయాలు, ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్, రాయలసీమ రాజకీయాలు, రాయలసీమలో జనసేన, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, వైఎస్ఆర్‌సీపీ జగన్, వైఎస్ జగన్
   పవన్ కళ్యాణ్ file


  ఎన్నికలకు ముందే జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాయలసీమపై ఆశలు వదులుకున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే, మిగతా రెండు ప్రధాన పార్టీల మాదిరి జనసేన చేపడుతున్న కార్యక్రమాలు అంత ప్రభావవంతంగా ఏమీ లేవు. వైఎస్ఆర్‌సీపీ, టీడీపీల మాదిరి గ్రౌండ్ వర్క్ కూడా రాయలసీమ విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేయడం లేదు. ఏం చేసినా రాబోయే ఎన్నికల్లో రాయలసీమలో టీడీపీ, వైసీపీల దాటుకుని సీట్లు గెలవడం కష్టమనే భావనలో ఆయన ఉన్నారనే టాక్ వినబడుతోంది. అందుకే రాయలసీమపై ఆయన అంతగా దృష్టి పెట్టడం లేదనే అభిప్రాయం ఉంది. అయితే, గతంలో అనంతపురం జిల్లాలో పర్యటించిన పవన్.. హిందూపురం నుంచి పోటీ చేస్తారనే ప్రచారమూ జరిగింది. అయితే, ఆ స్థానాన్ని తాను పోటీ చేయబోయే స్థానాల్లో రెండోదానిగా ఎంచుకునే అవకాశం ఉండొచ్చు తప్ప.. సీమ రాజకీయాల్లో నెగ్గుకొస్తామనే భరోసా పవన్‌లో కనిపించడం లేదని రాజకీయవర్గాల అభిప్రాయపడుతున్నాయి.

  janasena chief pawan kalyan, ap politics, ap political updates, rayalaseema, janasena in rayalaseema, ap cm chandrababu naidu, ysrcp jagan, ys jagan, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ఏపీ రాజకీయాలు, ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్, రాయలసీమ రాజకీయాలు, రాయలసీమలో జనసేన, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, వైఎస్ఆర్‌సీపీ జగన్, వైఎస్ జగన్
  పవన్ కళ్యాణ్(File)


  జనసేనకు కోస్తా జిల్లాల్లో మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో.. ఆ స్థానాలపైనే పూర్తిస్థాయిలో పవన్ కల్యాణ్ దృష్టి పెట్టినట్టుగా కనబడుతోంది. ఈ లెక్కన అంతగా ప్రాబల్యం లేని రాయలసీమపై దృష్టి కేంద్రీకరించడం టైమ్ వేస్ట్ అనే భావనలో పవన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికలకు సీమలో రాజకీయాలు టీడీపీ వర్సెస్ వైసీపీగానే నడిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో పవన్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి ఉమ్మడి రాష్ట్రంలో మొత్తంగా 18 స్థానాలు రాగా.. అందులో రాయలసీమలో రెండు స్థానాలు మాత్రమే దక్కాయి. మరో రెండు తెలంగాణ నుంచి, మిగితావి కోస్తా జిల్లాల నుంచే లభించాయి. ఈ లెక్కన పవన్ కల్యాణ్ కూడా అంతగా ప్రయోజనం లేని రాయలసీమపై దృష్టి పెట్టేకన్నా.. కోస్తా జిల్లాలపైనే గురి పెట్టాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
  First published: