పవన్ కల్యాణ్ పేరుతో వచ్చిన ఆ లేఖ... పచ్చి మోసం

తాజాగా పవన్ కల్యాణ్ మరోసారి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారన్న పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి. దీంతోఆయన అభిమానులు మరోసారి పవన్‌ను వెండితెరపై చూస్తామని భావిస్తున్నారు. మరికొందరు ప్రజాక్షేత్రాన్ని వదిలి జనసేనాని వెళ్లిపోతున్నారా ? అన్న ఆలోచనలో పడిపోయారు.

news18-telugu
Updated: September 3, 2019, 8:55 AM IST
పవన్ కల్యాణ్ పేరుతో వచ్చిన ఆ లేఖ... పచ్చి మోసం
పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: September 3, 2019, 8:55 AM IST
పవర్ స్టార్, జనసేన అధినేత  పవన్ కల్యాణ్ ఏం చేసినా వార్తే. తాజాగా ఆయన మరోసారి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారన్న పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి. దీంతోఆయన అభిమానులు మరోసారి పవన్‌ను వెండితెరపై చూస్తామని భావించారు. కొందరు రాజీకాయల్ని వదిలి పవన్ వెళ్లిపోతున్నారా ? అని ఫీల్ అయ్యారు. అయితే అలా వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది జనసేన పార్టీ . పవన్‌ చేస్తున్న సేవా కార్యక్రమాలు చూడలేకే కొందరు ఆయపై దుష్ప్రచారాం చేస్తున్నారని ఆరోపించింది. దీనికి సంబంధించి జనసేన ట్విట్టర్‌లో ఓ లేఖను విడుదల చేసింది. పవన్ కల్యాణ్ పేరుతో ఓ తప్పుడు లేఖను సృష్టించినట్లు పార్టీ దృష్టికి వచ్చిందని పేర్కొంది. పవన్ కల్యాణ్ తన పదవిని వదులుకొని సినిమాల్లో నటిస్తున్నారన్న కట్టుకధలతో ఆ లేఖ ఉందని తెలిపింది. ఇలాంటి అసత్య అంశాల్ని ఎవరూ నమ్మొద్దని పార్టీ పేర్కొంది.

పవన్‌పై అలాంటి తప్పుడు లేఖను సృష్టించి సర్క్యులేట్ చేస్తున్న వారిపై కేసు నమోదు చేసి చట్టపరంగా ముందుకు వెళ్లాలని జనసేన పార్టీ నిర్ణయించింది. పార్టీ లీగల్ విభాగం ఇందుకు అవసరమైన చర్యల్ని ప్రారంభించింది. నిరంతరం ప్రజలకు చేరువగా ఉండి.. ప్రజల పక్షాన నిలవడమే... తన బాద్యతని పవన్ కల్యాణ్ నమ్ముతారని జనసేన లేఖలో పేర్కొంది. దానికి అనుగుణంగా పవర్ స్టార్ ప్రజాక్షేత్రంలోనే ఉంటారన్నారు.First published: September 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...