జగన్ మాట్లాడకపోతే నిరాహార దీక్ష చేస్తా.. పవన్ కల్యాణ్ హెచ్చరిక..

అసెంబ్లీలో రైతు సమస్యలపై సీఎం జగన్ గొంతు విప్పకపోతే ఈ నెల 12 కాకినాడలో నిరాహార దీక్ష చేస్తానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.

news18-telugu
Updated: December 8, 2019, 5:59 PM IST
జగన్ మాట్లాడకపోతే నిరాహార దీక్ష చేస్తా.. పవన్ కల్యాణ్ హెచ్చరిక..
పవన్ కళ్యాణ్, జగన్
  • Share this:
అసెంబ్లీలో రైతు సమస్యలపై సీఎం జగన్ గొంతు విప్పకపోతే ఈ నెల 12 కాకినాడలో నిరాహార దీక్ష చేస్తానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఆదివారం నాడు తూర్పు గోదావరి జిల్లా వెలగతోడులో రైతుల సదస్సులో పాల్గొన్న పవన్.. రైతు సమస్యలపై వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. 100 మంది రైతుల్లో 60 మంది కౌలు రైతులే ఉన్నారని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర లేక కన్నీళ్లు పెడుతుంటే ఎమ్మెల్యేలు ఏసీ గదుల్లో తింటున్నారని విమర్శించారు. ధాన్యం విక్రయించి నెలన్నర గడుస్తున్నా రైతులకు పైసలు ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. 150 మంది ఎమ్మెల్యేలు రైతు రక్తంతో తడిసిన మద్దను తింటున్నారని అన్నారు. ఓట్ల కోసం వచ్చే నాయకులు.. రైతుల కన్నీళ్లు తుడిచేందుకు మాత్రం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ధాన్యం నిల్వ చేసిన రైతులకు రసీదులు ఇవ్వలేదని, వెంటనే వారికి రసీదులు ఇచ్చి మద్దతు ధర అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు తాను పోరాడతానని, రైతు సమస్యలపై సీఎం జగన్ నోరు విప్పాలని, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో రైతు సమస్యలపై మాట్లాడకపోతే కచ్చితంగా తాను నిరాహార దీక్ష చేస్తానని స్పష్టం చేశారు.

First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>