JANASENA PARTY CHIEF PAWAN KALYAN FIRES ON AP GOVERNMENT OVER ROADS PROBLEM IN THE STATE FULL DETAILS HERE PRN
Pawan Kalyan: సొంత జిల్లాలోనూ రోడ్లు వేయించుకోలేరా..? సీఎం జగన్ కు జనసేనాని చురకలు..
జనసేన అధినేత పవన్ కల్యాణ్
Janasena Party: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో రోడ్ల దుస్థితిని తెలియచేసేందుకు జనసేన పార్టీ #JSPForAP_Roads పేరుతో సోషల్ మీడియా ఉద్యమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసందే. దీనిపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) విమర్శించారు. రోడ్ల దుస్థితిని ప్రజలు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జనసేన పార్టీ చేపట్టిన #JSPForAP_Roads హ్యాష్ ట్యాగ్ ద్వారా మూడు రోజుల పాటు చేపట్టిన సోషల్ మీడియా ఉద్యమం (Social Media Campaign) విజయవంతమైందని ఆయన అన్నారు. లక్షలాది మంది ప్రజలు ఉద్యమంలో పాల్గొని రోడ్లకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారన్నారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితిని తెలియజేస్తూ 6 లక్షల 20వేల మంది ట్వీట్లు చేశారని.. సోషల్ మీడియా ద్వారా దాదాపు రెండున్నర కోట్ల ప్రజల ముందుకు ఈ సమస్యను తీసుకెళ్లామని పవన్ అన్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి రోడ్లను బాగుచేయించి ప్రజల ప్రాణాలు కాపాడాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలోని రోడ్ల దుస్థితి గురించి పవన్ మాట్లాడుతూ... “రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ రోడ్లు ఛిద్రమైపోయి ఉన్నాయి, సోషల్ మీడీయాలో వచ్చిన ఫోటోలు, వీడియోలు చూశాను. కృష్ణాజిల్లా, పామర్లు, పెడన నియోజకవర్గాలు, విశాఖ జిల్లా పెందుర్తి, అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో రోడ్లు ఎంత అధ్వాన్నంగా ఉన్నయో తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కడియం ప్రాంతంలో రోడ్లపైనే పైరు వేసుకునేలా ఉన్నాయి. ఈ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలోని గోకవరంలో గుర్తేడు – పాతకోట వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డుపై ఉన్న గంతల కారణంగా రన్నింగ్ లోని చక్రాలు ఊడిపోయాయన్నారు. ఇక నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో గజానికో గొయ్యి కనిపిస్తోంది. మనిషి కూర్చొనేంతగా గోతులున్నాయి. ప్రకాశం జిల్లా చీమకుర్తి ప్రాంతంలో రోడ్లు మరీ దారుణంగా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ప్రాంతంలో రోడ్ల పరిస్థితి గురించి ఎంతతక్కువ మాట్లాడుకుంటే అంతమంచిది. వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేటలో రోడ్లు నరకకూపంలా మారాయి. కనీసం సొంతజిల్లాలోనూ సీఎం రోడ్లకు మరమ్మతులు చేయించలేకపోయారు. తిరుపతిలో రోడ్లను బాగు చేసేందుకు తమ పార్టీ శ్రేణులు భిక్షాటన చేశాయి.” అని అన్నారు.
కొంతకాలంగా రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. రోడ్లు గుంతలతో నిండిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈనేపథ్యంలో జనసేన పార్టీ మూడు రోజుల సోషల్ మీడియా ఉద్యమానికి పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల దుస్థితికి సంబంధించిన వేలాది ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. గతంలో టీడీపీ నేతలు రోడ్లపై నాట్లు వేసి, చేపలు పట్టి నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఐతే వాటిపై కొన్ని ట్రోలింగ్స్ కూడా వచ్చాయి. ఈ సారి జనసేన పార్టీ ఫోటోలు, వీడియోలతో రుజువులు చూపిస్తూ ఉద్యమం చేయడం రోడ్ల దుస్థితిని తేటతెల్లం చేసింది. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.