జనసేన నుంచి ఎమ్మెల్యే రాపాక సస్పెండ్.. అసలు నిజం ఇదీ..

జనసేన పార్టీ ఆదేశాలను ధిక్కరించి మూడు రాజధానుల బిల్లుకు ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అయితే.. పార్టీ అధినేత ఆదేశాలను ధిక్కరించినందుకు ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఓ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

news18-telugu
Updated: January 21, 2020, 11:57 AM IST
జనసేన నుంచి ఎమ్మెల్యే రాపాక సస్పెండ్.. అసలు నిజం ఇదీ..
రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, పవన్ కళ్యాణ్(ఫైల్ ఫోటో)
  • Share this:
జనసేన పార్టీ ఆదేశాలను ధిక్కరించి మూడు రాజధానుల బిల్లుకు ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అయితే.. పార్టీ అధినేత ఆదేశాలను ధిక్కరించినందుకు ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఓ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేరిట ఆ ప్రెస్‌నోట్ నెట్టింట్లో హల్‌చల్ చేసింది. దీంతో.. జనసేన మీడియా వింగ్ స్పందించాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ నిజమైంది కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన రిలీజ్ చేసింది. పార్టీ మీడియా గ్రూప్‌ల నుంచి మాత్రమే సందేశాలను, ప్రెస్‌నోట్లను విడుదల చేస్తామని స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ ప్రెస్‌నోట్


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ న్యూస్‌ను నమ్మవద్దని తెలిపింది. ఏవేని వార్తలను క్రాస్ చెక్ చేసుకోవడానికి పార్టీ సోషల్ మీడియా సైట్లను సందర్శించాలని, లేదా.. పార్టీ మీడియా వింగ్‌ను సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది.
Published by: Shravan Kumar Bommakanti
First published: January 21, 2020, 11:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading