పవన్ కల్యాణ్‌కు షాక్... ఇంగ్లీష్‌ మీడియంకు జనసేన ఎమ్మెల్యే మద్దతు

ఇంగ్లీష్ మీడియం విషయంలో ప్రభుత్వాన్ని ఏకరువు పెడుతున్న సమయంలో ప్రభుత్వానికి మద్దతుగా జేఎస్పీ ఎమ్యెల్యే రాపాక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

news18-telugu
Updated: December 11, 2019, 11:13 AM IST
పవన్ కల్యాణ్‌కు షాక్... ఇంగ్లీష్‌ మీడియంకు జనసేన ఎమ్మెల్యే మద్దతు
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్
  • Share this:
ఇంగ్లీష్ మీడియంపై జనసేనలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు పవన్ ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తుంటే.. ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక మాత్రం సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ఓ మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపై గతంలో ఓ ప్రయత్నం చేశారన్నారు. మరి ఇప్పుడెందుకు చంద్రబాబు జగన్‌ను అడ్డుకుంటున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనపై ప్రభుత్వాన్ని సమర్ధించారు జనసేన ఎమ్యెల్యే రాపాక వరప్రసాద్. ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో మట్లాడుతూ ఆయన ఇంగ్లీష్ మీడియంపై ఇజగన్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఒకపక్క అధినేత పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ మీడియం విషయంలో ప్రభుత్వాన్ని ఏకరువు పెడుతున్న సమయంలో ప్రభుత్వానికి మద్దతుగా జేఎస్పీ ఎమ్యెల్యే రాపాక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

మరోవైపు స్పీకర్ పై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదన్నారు. స్పీకర్‌ను అంతా గౌరవించాలన్నారు. ఎవరు ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వమైనా స్పీకర్ చైర్‌ను గౌరవించాలన్నారు. స్పీకర్‌కు సుదీర్ఘ అనుభవం ఉందన్నారు.
First published: December 11, 2019, 11:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading