సీఎం జగన్‌పై జనసేన ఎమ్మెల్యే పొగడ్తలు

ఏపీ అసెంబ్లీలో మరో విపక్షమైన జనసేనకు చెందిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం బడ్జెట్‌ను ప్రశంసించారు. అభివృద్ది, సంక్షేమం రెండింటికి సమానమైన ప్రాధాన్యత చేస్తూ సీఎం జగన్ సారథ్యంలోని ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టిందని జనసేన సభ్యుడు రాపాక వరప్రసాద్ వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: July 17, 2019, 1:31 PM IST
సీఎం జగన్‌పై జనసేన ఎమ్మెల్యే పొగడ్తలు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి
  • Share this:
ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌పై విపక్ష టీడీపీ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. బడ్జెట్ ఏ మాత్రం ఆశాజనకంగా లేదని టీడీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. అయితే ఏపీ అసెంబ్లీలో మరో విపక్షమైన జనసేనకు చెందిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం బడ్జెట్‌ను ప్రశంసించారు. అభివృద్ది, సంక్షేమం రెండింటికి సమానమైన ప్రాధాన్యత చేస్తూ సీఎం జగన్ సారథ్యంలోని ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టిందని జనసేన సభ్యుడు రాపాక వరప్రసాద్ వ్యాఖ్యానించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బాటలోనే ఆయన కుమారుడు జగన్ కూడా నడుస్తున్నారని అన్నారు.

సీఎం జగన్ వ్యవసాయం గురించి శ్రద్ద చూపుతున్నారని అభినందించారు. వ్యవసాయం దండగ అనే పరిస్థితి నుంచి వ్యవసాయం పండగ అన్న విధంగా తీసుకు వచ్చింది రాజశేఖరరెడ్డి అని జనసేన ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఇప్పుడు జగన్ కూడా రైతులకు పెట్టుబడి సాయం చేస్తూ వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చారని ఎమ్మెల్యే వరప్రసాద్ అన్నారు. పంట నష్టపోయి ఎవరైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబానికి ఏడు లక్షల పరిహారం ఇవ్వాలన్న సీఎం జగన్ నిర్ణయం హర్షణీయమని తెలిపారు. కౌలు రైతులకు ఒప్పందపత్రాన్ని ప్రవేశపెట్టడాన్ని కూడా ఎమ్మెల్యే వరప్రసాద్ సమర్ధించారు.

కొబ్బరి రైతులు ధరలు రాక బాగా నష్టపోతున్నారని ఈ సందర్భంగా ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. కొబ్బరిని కూడా కొనుగోలు చేస్తామని జగన్ చెప్పారని గుర్తు చేసిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్... వెంటనే ఆ కార్యక్రమం చేపట్టాలని కోరారు. రైతులు జగన్ ప్రభుత్వం కోసం ఎదురు చూశారని... మత్సకారులు కూడా జగన్ పై నమ్మకం పెట్టుకున్నారని, వారు కోరుకోకుండానే వారికి వరాలు తీర్చే వ్యక్తిగా జగన్‌ను చూస్తున్నారని జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్ అన్నారు.First published: July 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు