జగన్‌కు జనసేన ఎమ్మెల్యే పాలాభిషేకం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పాలాభిషేకం చేశారు.

news18-telugu
Updated: October 18, 2019, 7:23 PM IST
జగన్‌కు జనసేన ఎమ్మెల్యే పాలాభిషేకం
జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న జనసేన ఎమ్మెల్యే రాపాక (సర్కిల్‌లో ఉన్న వ్యక్తి)
news18-telugu
Updated: October 18, 2019, 7:23 PM IST
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పాలాభిషేకం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం ఏటా రూ.10వేల చొప్పున ఇచ్చేందుకు వైఎస్ఆర్ వాహనమిత్ర పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇటీవల ఏలూరులో ప్రారంభించారు. జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన ఈ పథకాన్ని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అభినందించారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలులో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పినిపే విశ్వరూప్‌తో కలసి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి కూడా ఆటో డ్రైవర్ గెటప్‌లో ఖాకీ చొక్కా వేసుకున్నారు. తాజాగా జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసే సమయంలో మంత్రి విశ్వరూప్, జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా ఆటో డ్రైవర్లలా ఖాకీ చొక్కాలు ధరించారు.

జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న జనసేన ఎమ్మెల్యే రాపాక


2019 ఏప్రిల్‌లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో జనసేన పార్టీ తరఫున కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలుపొందారు. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. రాజోలులో మాత్రమే రాపాక వరప్రసాద్ జనసేన గుర్తు మీద విజయం సాధించారు. అయితే, రాపాక కూడా వెంటనే పార్టీ మారతారంటూ ప్రచారం జరిగింది. ఆయన కూడా జంప్ అధికార పార్టీలోకి జంప్ అయ్యేందుకు చర్చలు జరిపారని వార్తలు వచ్చాయి. అయితే, జగన్ మోహన్ రెడ్డి వద్దని వారించారని, నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్ని రకాలుగా సాయం అందిస్తామని జగన్ హామీ ఇవ్వడంతో ఆయన జనసేనలోనే ఉండిపోయారని తెలిసింది.

First published: October 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...