పవన్ కళ్యాణ్‌కు జనసేన ఎమ్మెల్యే షాక్ ఇస్తారా ?

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీలోకి వచ్చే అవకాశం లేకపోలేదని ఇటీవల జనసేన నుంచి వైసీపీలోకి వచ్చిన అద్దెపల్లి శ్రీధర్ అన్నారు.

news18-telugu
Updated: December 3, 2019, 4:32 PM IST
పవన్ కళ్యాణ్‌కు జనసేన ఎమ్మెల్యే షాక్ ఇస్తారా ?
రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, పవన్ కళ్యాణ్(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీలో జనసేనకు ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. జనసేన తరపున రాజోలు నుంచి విజయం సాధించిన రాపాక వరప్రసాద్‌ను ఆ పార్టీ పెద్దగా పట్టించుకోవడం లేదనే ప్రచారం కూడా జరిగింది. ఆయన పార్టీ మారే అవకాశం ఉందనే టాక్ కూడా వినిపించింది. అయితే తాను జనసేనలోనే కొనసాగుతానని చెప్పిన ఎమ్మెల్యే రాపాక... కొద్దిరోజుల క్రితం ముమ్మిడివరంలో సీఎం జగన్ హాజరైన బహిరంగ సభకు వచ్చారు. అయితే సీఎం జిల్లాకు రావడం వల్లే ఎమ్మెల్యే రాపాక ఈ సమావేశానికి వచ్చారని జనసేన వర్గాలు తెలిపాయి. అయితే ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీలోకి వచ్చే అవకాశం లేకపోలేదని... జనసేన నుంచి వైసీపీలో చేరిన అద్దెపల్లి శ్రీధర్ తెలిపారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించిన ఆయన... రాపాక వరప్రసాద్ పార్టీ మార్పు అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాపాక వరప్రసాద్‌కు జనసేనలో సన్నిహితంగా ఉండే ముగ్గురు నాయకులు వైసీపీలో చేరిపోయారని... కాబట్టి ఆయన కూడా వైసీపీలో చేరే అవకాశం ఉందని ఆయన కామెంట్ చేశారు. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది ఆయనే అని తెలిపారు.






First published: December 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>