పవన్ కల్యాణ్‌ని తీసుకొస్తా... జనసేన ఎమ్మెల్యే వార్నింగ్

ఇటీవల తనతో దురుసుగా ప్రవర్తించిన మలికిపురం ఎస్సై రామారావుపై కూడా చర్యలు తీసుకోవాలని రాపాక డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: August 16, 2019, 2:28 PM IST
పవన్ కల్యాణ్‌ని తీసుకొస్తా...  జనసేన ఎమ్మెల్యే వార్నింగ్
రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, పవన్ కళ్యాణ్
  • Share this:
జనసేన నేత, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డిని ఆయన కలిశారు. ఈ సందర్బంగా జిల్లాలోని ప్రజల సమస్యలతో పాటు తన ప్రోటోకాల్ వివాదంపై కలెక్టర్‌తో మాట్లాడారు. తాజాగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని రాపాక కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఇటీవల తనతో దురుసుగా ప్రవర్తించిన మలికిపురం ఎస్సై రామారావుపై కూడా చర్యలు తీసుకోవాలని రాపాక డిమాండ్ చేశారు. వెంటనే ఎస్సైను డిమాండ్ చేయాలన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను తీసుకొచ్చి ధర్నా చేస్తామని హెచ్చరించారు.  అయితే... ఎస్సై రామారావు విషయాన్ని పూర్తిగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎమ్మెల్యే రాపాకకు హామీ ఇచ్చారు.

ఇటీవల పేకాట ఆడుతూ అరెస్టయిన తన అనుచరుల్ని వదిలిపెట్టాలని జనసేన ఎమ్మెల్యే రాపాక మలికిపురం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన అక్కడే ధర్నాకు దిగారు. పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేశారని రాపాకపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత రాపాక పోలీసులకు లొంగిపోయారు. అనంతరం బెయిల్ ‌పై విడుదలైన విషయం తెలిసిందే.

First published: August 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు